Southern Zonal Council: ప్రతిష్ఠాత్మక సదరన్ జోనల్ కౌన్సిల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిధ్యమిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల సమాఖ్య 29వ సమావేశం ఏర్పాట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి(Southern Zonal Council Meeting) ఏపీ ప్రభుత్వం ఆతిధ్యమిస్తోంది. తిరుపతిలో నవంబర్ 14వ తేదీన జరగనున్న ఈ సమావేశం ఏర్పాట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకతోటి సుచరిత హాజరయ్యారు. 


ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పాండిచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, సలహాదారులు, సీనియర్ అధికారులు తమ తమ ఎజెండాలతో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల సమన్వయం, కేంద్ర రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని పలు కీలకాంశాలు చర్చకు రానున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. మొత్తం మీద 90 నుంచి 100 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఆతిధ్య రాష్ట్రంలో సమావేశానికి కావల్సిన అన్ని ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Ap government) చేయనుంది. సమావేశం నిమిత్తం మౌళిక సదుపాయాలు, రిసెప్షన్, సెక్యూరిటీ, రవాణా, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సౌకర్యాల్ని కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడీ ఏర్పాట్లపైనే వైఎస్ జగన్ సమీక్షించారు. 


Also read: Raghuveera reddy: ఆయనకు ఏమైంది, ఎందుకు స్థంభానికి కట్టేశారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook