Operation Opposition: రాజకీయాల్లో వారిది ప్రత్యేక ఎత్తుగడ… చట్టసభల్లో మెజారిటీగా ఉండాలన్నదే లక్ష్యం. ప్రతిపక్షం ఉన్నా.. అధికార పార్టీదే పైచేయిగా నిలవాలన్నదే ధ్యేయం. ఎన్నికల్లో గెలిచి ప్రజల్లో విశ్వాసం చూరగొనడం వేరు. గెలవకపోయినా ప్రత్యర్థి రాజకీయ పార్టీలను తమవైపు తిప్పుకోవడం వేరు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లే చేసిన గేమ్నే బీజేపీ ఆడుతుంది. అంతేకాదు కేంద్రంలో ఉన్న ఎన్డీయే సర్కారు ఆపరేషన్ అపోజిషన్ తో ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బ తీయడానికి వ్యూహాలకు పదును పెట్టింది.
NDA 2/3 Majority Will Reach: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కేంద్రంలో కొలువై 12 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ పుష్కర కాలంలో నరేంద్ర మోడీ సర్కారు జీఎస్టీ, ఆర్టికల్ 370, ఆర్టికల్ 30 ఏ రద్దు సహా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అయితే కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లు కోసం ఇంకా కష్టపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్డీయేకు ఇపుడు రాజ్యసభలో ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది.
AP CM Chandrababu Request Funds To Union Ministers Amit Shah And CR Patil At New Delhi: కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం మరోసారి ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించి వాటికి నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రులు అమిత్ షా, సీఆర్ పాటిల్‌ను కోరారు.
Telangana BJP: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో వెస్ట్ బెంగాల్లో బిజెపి తొలిసారిగా అధికారం చేపట్టనుండడం విశేషం. గడచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి వెస్ట్ బెంగాల్లో గట్టిగా పాగా వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోగా 2016లో కేవలం 3 సీట్లు మాత్రమే లభించగా ఆ తర్వాత 2021 లో జరిగిన ఎన్నికల్లో బిజెపి ఏకంగా 77 సీట్లకు పెరిగింది. ఆ తర్వాత బిజెపి 2026 నాటికి అధికారం చేపట్టే ఇంకా 200 సీట్లు సాధించింది. గడచిన పది సంవత్సరాలుగా బిజెపి వెస్ట్ బెంగాల్లో తీవ్రంగా ఫోకస్ చేసి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా వెస్ట్ బెంగాల్లో ఎదగడం చూడవచ్చు.
West Bengal CM Suvendu AdhikariNet worth And Assets Details: పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుండగా.. మమతా బెనర్జీ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని ఆమె శిష్యుడు సువేందు అధికారి అధిరోహించనున్నాడు. ఈ మేరకు బీజేపీ సీఎం అభ్యర్థిని ఖరారు చేసింది. సీఎం సువేందు అధికారి వ్యక్తిగత విషయాలు, ఆయన ఆస్తిపాస్తులు తెలుసుకుందాం.
Rishab shetty meets with amitsha: కేంద్ర హోమంత్రి అమిత్ షా గారికి మన సంస్కృతి, కళలు, చరిత్రలపై లోతైన అనుభవం ఉందని నటుడు రిషభ్ శెట్టి చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆయనను కలవడం తన జీవితంలో మర్చిపోలేనని అన్నారు.
Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతల తీరు హైకమాండ్‌కు తలనొప్పిగా మారిందా..! రాష్ట్ర నేతలంతా ఒకరికి వ్యతిరేకంగా మరొకరు వరుస కంఫ్లైంట్లతో హైకమాండ్‌కు ఫిర్యాదులు చేస్తున్నారా..! చివరకు రాష్ట్ర చీఫ్‌కు వ్యతిరేకంగా.. పోస్టులు పెడుతుండటంతో హైకమాండ్ సీరియస్ అయ్యిందా..! ఈ విషయంలో కొందరు నేతలకు లెఫ్ట్ రైట్ ఇచ్చిందా..! ఇంతకీ రాష్ట్ర చీఫ్ ను కూడా వదలని ఆ నేతలు ఎవరు..!
Telangana Delimitation Letter: దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈ నెల 16 నుంచి 18 వరకు దీనిపై పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఈ నియోజకవర్గాల పునర్విభజనపై తన అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి ఓ లేఖ రూపంలో ప్రధాని మోదీకి పంపారు.
Delimitation Bill 2026: దేశ వ్యాప్తంగా లోక్ సభతో పాటు అసెంబ్లీ స్థానాల పెంపు కోసం నరేంద్ర మోడీ కీలక అడుగు వేసింది. ముందుగా జనగణన చేసిన తర్వాత ఈ డీలిమిటేషన్ ఉంటుందనే ప్రచారం జరిగింది. సాధారణంగా అలాగే జరగాలి. కానీ నరేంద్ర మోడీ మాత్రం డీ లిమిటేషన్ విషయంలో అద్భుతమైన అడుగు వేయడంతో బిత్తరపోవడం ప్రతిపక్షాల వంతు అయింది.
Nitish files as files nomination for rajya sabha: పెద్దల సభకు నితీష్ కుమార్ స్వయంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంకు ఎన్డీయే కూటమి నేతలు పాల్గొన్నారు. అమిత్ షా ఈ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telangana CM Hot Discussion With Union Minister Amit Shah: కేంద్ర హోం మంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. మావోయిస్టుల లొంగుబాటుతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర హోంమంత్రితో తెలంగాణ సీఎం చర్చించి.. పలు విజ్ఞప్తులు చేశారు.
Kerala Name Changed: దేశంలో మరో రాష్ట్రం పేరు మారిపోయింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉన్న కొన్ని రాష్ట్రాల పేర్లను ఆయా ప్రాంతీయత, భాష, ఇతరత్రా సాంస్కృతిక వైభనానికి సూచికగా మార్చిన సందర్భాలున్నాయి. తాజాగా మన దేశంలో కింద వరసన ఉన్న కేరళ రాష్ట్రం పేరు మారుస్తూ కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
Bharat Taxi: దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రైవేట్ క్యాబ్ సంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ.. సామాన్యులకు తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు 'భారత్ ట్యాక్సీ' యాప్‌ను అధికారికంగా ప్రారంభించింది. విజ్ఞాన్ భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ యాప్‌ను లాంచ్ చేశారు.
Chandrababu Request To Center On Capital Amaravati Official Announcement: ఏపీ రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించాలని కేంద్రానికి చంద్రబాబు కీలక విజ్ఞప్తి చేశారు. రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత తేవాలని కోరారు. ఏపీ రాజధానిగా అధికారిక గుర్తింపు లభిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు.
Maoist Top Leader Barse Deva Surrender To Police: మావోయిస్టుల ఏరివేత లక్ష్యం సాకారమవుతోంది. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు అగ్ర నాయకుడు బర్సె దేవా లొంగిపోవడంతో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Bihar Exit Polls 2025 In Telugu: దేశంలో అతి పెద్ద బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. నితీశ్ కుమార్ వర్సెస్ తేజస్వి యాదవ్ అనేలా ఎన్నికల పోరు నడవగా.. ఎవరిది గెలుపు అనేది ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. బిహార్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి.
Delhi Blast Narendra Modi KCR YS Jagan Chandrababu And Other VVIPs Deeply Shocked: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు సంభవించడంతో యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. బాంబు పేలుళ్లపై మోదీ, కేసీఆర్, వైఎస్ జగన్, అమిత్ షాతో సహా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court on Waqf Amedement bill 2025: ఈ యేడాది పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొంది చట్టంగా రూపొందించిన వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. మొత్తం బిల్లుపై కాకుండా అందులోని కీలక నిబంధనపై కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
All Set To Amit Shah Hyderabad Tour On September 6th: దేశంలో అత్యంత వైభవంగా సాగే హైదరాబాద్ గణేశ్ శోభాయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. భారీ స్థాయిలో జరగనున్న మహా నిమజ్జనానికి అమిత్ షా వస్తుందడడంతో అత్యంత భద్రత ఏర్పాటుచేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Amit Shah fires on Vice President Candidate Sudarshan Reddy: కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఇండి కూటమి అభ్యర్ధిగా ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న తెలుగు వాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన నక్సలైట్స్ కు అనుకూలంగా పలు తీర్పులు ఇచ్చిన అర్బన్ నక్సల్ అంటూ దుమ్మెత్తి పోసారు.
Amit Shah Record: రీసెంట్ గా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఓ రికార్డు నెలకొల్పారు. నెహ్రూ తర్వాత అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెస్ యేతర ప్రధానిగా రికార్డు క్రియేట్ చేశారు. తాజాగా హోం మంత్రి అమిత్ షా ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది.
Central Cabinet Reshuffle: కేంద్ర క్యాబినెట్ లో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయా..! కేంద్ర మంత్రివర్గంలో కొందరు మంత్రులను తప్పించి వారికి పార్టీలో కీలక పదవులు కట్టబెట్టబోతున్నారా? ఇందులో తెలంగాణలో ఓ మంత్రిని తప్పించి ఆయనకు రాష్ట్ర చీఫ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆయన మంత్రి పోస్ట్ ను మరో ఎంపీ కి ఇచ్చే ఆలోచన చేస్తున్నారా?