New Ration Cards: రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్‌న్యూస్. ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. అర్హులైనవారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది. రేపు అంటే డిసెంబర్ 2 నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. అటు ఆన్‌లైన్ ఇటు ఆఫ్‌‌లైన్ విదానాల్లో రేషన్ కార్డు కూడా దరఖాస్తు సుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏ రాష్ట్రంలో అయినా సంక్షేమ పథకాల అమలుకు ప్రామాణిక రేషన్ కార్డు కావడంతో వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అర్హులైనవారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 2 అంటే రేపట్నించి 28వ తేదీ వరకూ రేషన్ కార్డులు జారీ కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు కూడా రేషన్ కార్డులే ఆధారం. అర్హులైనవాళ్లు కొత్త రేషన్ కార్డు కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు విభజన, మార్పులు, చేర్పులు కూడా జరగనున్నాయి. ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 28 వరకూ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. 


దరఖాస్తుల స్వీకరణ గడువు తరువాత స్క్రీనింగ్ ప్రక్రియ ఉంటుంది. అంతా పూర్తయ్యాక సంక్రాంతి లోపే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త డిజైన్లు, రాజముద్రతో కూడిన రేషన్ కార్డులు అందించనున్నారు. డిసెంబర్ మూడోవారంలో జరగనున్న కేబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డులకై చర్చ జరగనుంది. ఏపీలో దాదాపు 1.50 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ కావచ్చని అంచనా. 


Also read: Diabetes Remedy: డయాబెటిస్, మలబద్ధకం సమస్యను ఇట్టే దూరం చేసే పదార్ధం ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.