Oxygen Demand: ఏపీలో గణనీయంగా తగ్గిన ఆక్సిజన్ వినియోగం, ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు
Oxygen Demand: ఏపీలో కరోనా సంక్రమణ, ఆక్సిజన్ వినియోగం తగ్గుముఖం పట్టాయి. కోవిడ్ చికిత్సకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది.
Oxygen Demand: ఏపీలో కరోనా సంక్రమణ, ఆక్సిజన్ వినియోగం తగ్గుముఖం పట్టాయి. కోవిడ్ చికిత్సకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది.
ఏపీలో కరోనా సంక్రమణ(Coronavirus spread) పీక్స్‌కు చేరి..తరువాత తగ్గడం ప్రారంభించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా కర్వ్ 25.56 శాతం వరకూ వెళ్లిందని..ఇప్పుడు 17 శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. అదే సమయంలో యాక్టివ్ కేసులు 2.11 లక్షల వరకూ వెళ్లి..ఇప్పుడు 1.74 లక్షలకు దిగిపోయాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. అదే సమయంలో ఏపీలో గత 5 రోజులుగా ఆక్సిజన్ వినియోగం (Oxygen Usage)కూడా తగ్గిందన్నారు. మొన్నటి వరకూ 640 టన్నుల ఆక్సిజన్ వినియోగించగా..ఇప్పుడు 510 టన్నుల ఆక్సిజన్ వినియోగిస్తున్నారని చెప్పారు. ఇది నిజంగానే ఓ మంచి పరిణామమన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ (Oxygen Plants)ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని..ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ అందిస్తామన్నారు. కోవిడ్ చికిత్సకు సంబంధించిన నిబంధనల్ని ఉల్లంఘించిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 66 ఆసుపత్రులపై విజిలెన్స్ విభాగం నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. చాలా ఆసుపత్రులకు పెనాల్టీ విధించామని..వైద్య ఆరోగ్య శాఖాపరంగా కూడా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వ్యాక్సినేషన్(Vaccination) ప్రక్రియలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
ఇక బ్లాక్ ఫంగస్ (Black Fungus)చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లను కేంద్ర ప్రభుత్వమే (Central government) కేటాయిస్తోందని చెప్పారు అనిల్ కుమార్ సింఘాల్. కేంద్రం నుంచి 7 వేల 725 యాంపోటెరిసిన్ -బి ఇంజకన్లు వచ్చాయని చెప్పారు. పొసాకొనోజోన్ ఇంజక్షన్లు 1250 వచ్చాయని తెలిపారు. మరో 50 వేల ఇంజక్షన్లకు ఆర్డర్ ఇచ్చామన్నారు.
Also read: AP Corona Update: ఏపీలో వరుసగా మూడవ రోజు గణనీయంగా తగ్గిన కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook