Pneumonia Vaccine: న్యుమోనియా వ్యాధి అత్యంత ప్రమాదకరమైంది. ఇప్పుడీ వ్యాధి నియంత్రణకు ఇచ్చే వ్యాక్సిన్ రాష్ట్రంలో అందుబాటులో రానుంది. త్వరలో ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యుమోనియో(Pneumonia)వ్యాధి ఎంత ప్రమాదకరమో ఆ వ్యాధి నియంత్రణకు ఇచ్చే వ్యాక్సిన్ కూడా అంతే ఖరీదు. అందుకే 2017లోనే దేశంలో అందుబాటులో వచ్చినా..అందరికీ ఇవ్వడం సాధ్యం కాలేదు. న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ పీసీవీగా పిలిచే ఈ వ్యాక్సిన్ ఇకపై ఏపీ ప్రభుత్వాసుపత్రుల్లో వేయనున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. తాజాగా ఏపీతో పాటు తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అందుబాటులో రానుంది. 


ఈ నెల 20వ తేదీ తరువాత నుంచి ఈ వ్యాక్సిన్ రాష్ట్రంలో వేయనున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో న్యుమోనియో వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారం రోజుల్నించి మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఫార్మసిస్టులకు శిక్షణ ఇస్తున్నారు. పుట్టిన బిడ్డకు 9 నెలల వయస్సు వచ్చేలోగా మూడు డోసులు వేయించుకోవల్సి ఉంటుంది. పుట్టిన ఆరు వారాల లోపు వయస్సులో తొలి డోసు, 14 వారాల వయస్సులో రెండవ డోసు, 9 నెలల వయస్సులో మూడవ డోసు ఇవ్వాల్సి ఉంటుంది. మూడు డోసులు పూర్తయితేనే న్యుమోనియో నుంచి పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి యేటా 8.0 లక్షల శిశువులు జన్మిస్తున్నట్టు అంచనా. పుట్టిన పిల్లలకు ఇప్పటికే 11 రకాల వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు ఇస్తుండగా..ఇది 12వ వ్యాక్సిన్ అవనుంది. త్వరలో న్యుమోనియా వ్యాక్సినేషన్(Pneumonia Vaccination) తేదీ ఖరారు చేసి..ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)చేతుల మీదుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించనున్నారు. 


Also read: కరోనా థర్డ్‌వేవ్‌కు రాష్ట్రంలో 462 ప్రైవేటు ఆసుపత్రులు సిద్ధం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook