ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం ; ఆగస్టు 24 నుంచి డీఎస్సీ
ఎట్టకేలకు ఏపీ సర్కార్ నిరుద్యోగులపై కనికరం చూపించింది. గత నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10 వేల 351 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 24 నుంచి 26 వరకు డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ గతంలో మాదిరిగా కాకుండా డీఎస్పీ పరీక్షలు రాసిన వెంటనే మార్కులు వెల్లడించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పరీక్షలు నిర్వహించే బాధ్యత ఏపీపీఎస్పీకి అప్పగించామని తెలిపారు. అయితే పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ ఆమోదం రాగానే ఏపీపీఎస్సీ అధికారిక షెడ్యూల్ విడుదల చేస్తుందని వెల్లడించారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 113 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి గంటా తెలిపారు.
పాఠశాలలు | ఖాళీలు |
జడ్పీ ప్రభుత్వ పాఠశాలలు | 4, 626 పోస్టులు |
పురపాలక పాఠశాలలు | 1, 4 48 పోస్టులు |
మోడల్ స్కూల్ | 929 పోస్టులు |
కొత్తగా సృష్టించిన ఖాళీలు | 3,290 పోస్టులు |
మొత్తం | 10,351 పోస్టులు |