AP Govt: 15 మంది ఐపీఎస్‌లకు స్థాన చలనం..జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!
AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీనియర్ ఐపీఎస్‌లకు స్థాన చలనం కల్గించింది. ఐజీపీ స్పోర్ట్స్, సంక్షేమానికి ఎల్వీకే రంగారావు, ఆక్టోపస్ డీఐజీగా ఎస్వీ రాజశేఖర్ బాబు బదిలీ అయ్యారు.
AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీనియర్ ఐపీఎస్‌లకు స్థాన చలనం కల్గించింది. ఐజీపీ స్పోర్ట్స్, సంక్షేమానికి ఎల్వీకే రంగారావు, ఆక్టోపస్ డీఐజీగా ఎస్వీ రాజశేఖర్ బాబు బదిలీ అయ్యారు. ఏసీబీ డీఐజీగా పీహెచ్‌డీ రామకృష్ణ, ట్రైనింగ్ డీఐజీగా కేవీ మోహన్‌రావు, గ్రైహౌండ్స్ డీఐజీగా గోపినాథ్ జెట్టి నియమితులైయ్యారు.
కాకినాడ బెటాలియన్ కమాండెంట్‌గా రవీంద్రనాథ్ బాబు, విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్ గున్నీ, గుంతకల్ రైల్వే ఎస్పీగా అజిత్ వేజెండ్ల పదోన్నతి పొందారు. రంపచోడవరం ఏఎస్పీగా జీ.కృష్ణకాంత్, చిత్తూరు అడిషనల్ అడ్మిన్ ఎస్పీగా పీ.జగదీష్ బదిలీ అయ్యారు. పాడేరు అడిషనల్ అడ్మిన్ ఎస్పీగా తుహీన్ సిన్హా, పల్నాడు అడిషనల్ అడ్మిన్ ఎస్పీగా బిందు మాధవ్ ఎంపికయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా రవికుమార్ నియమితులైయ్యారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతోనే ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారన్న వాదన వినిపిస్తోంది. దీనిని ప్రభుత్వంతోపాటు వైసీపీ(YCP) ఖండిస్తోంది. వృతిరిత్యా కారణాలతోనే ప్రతి ప్రభుత్వం బదిలీలు చేస్తుందని స్పష్టం చేస్తోంది.
Also read:Kamal Haasan: మాతృ భాష కోసం దేనికైనా రెడీ..కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు..!
Also read:Chandra Babu Naidu: సీఎం జగన్ ఇలాకాలో చంద్రబాబు పాచికలు పారుతాయా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook