Chandra Babu Naidu: రాయలసీమపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారా.? వచ్చే ఎన్నికల్లో సీట్లు పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారా..? సీఎం జగన్ ఇలాకాలో పాగా వేయాలానుకుంటున్నారా..? బాదుడే బాదుడు కార్యక్రమంతో టీడీపీలో జోష్ వస్తుందా..? తమ్ముళ్లకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు..?
రాయల సీమ జిల్లాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు. రాబోయే ఎన్నికల్లో పూర్వవైభవం తీసుకురావాలని చూస్తున్నారు. ఆ దిశగా కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాయల సీమ జిల్లాల్లో పర్యటనకు షురూ చేశారు. రేపు సీఎం జగన్ ఇలాకాలో ఆయన పర్యటించనున్నారు. కమలాపురంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలపై ఎలాంటి భారం పడిందో ప్రజలకు వివరిస్తారు.
అదే సమయంలో కేడర్‌లో ఉత్సాహాన్ని నింపనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బాదుడే బాదుడు కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అదే విధంగా కడప జిల్లాలోనూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెబుతున్నారు. ఆ దిశగా ముందుకు వెళ్తామంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ దిమ్మ తిరిగే షాక్‌ను ఇస్తామంటున్నారు.
2014, 2019 ఎన్నికల్లో రాయల సీమ జిల్లాల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. ఆ పార్టీకి కంచుకోటలాంటి ప్రదేశాల్లో ఓటమి పాలైంది. 2014 ఎన్నికల్లో సుమారు సీట్లు వచ్చినా..2019 ఎన్నికల్లో మాత్రం పరాభవం తప్పలేదు. కేవలం ముగ్గురు మాత్రమే రాయలసీమ నుంచి గెలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన బావమరిది, హీరో బాలకృష్ణ, మరో నేత పయ్యావుల కేశవ్ మాత్రమే విజయం సాధించారు. కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గెలుపొందారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులోభాగంగానే రాయలసీమ జిల్లాలపై చంద్రబాబు(CHANDRA BABU) ఫోకస్ చేశారు. ఎన్టీఆర్ హయాంలోనూ ఇక్కడే నుంచి అధిక మంది గెలిచారని గుర్తు చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నేతల పాచికలు ఏమేరకు పారుతాయో చూడాలి..
Also read:Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోకు చెల్లెలిగా పూజాహెగ్డే.. హీరో ఎవరంటే!
Also read:Kamal Haasan: మాతృ భాష కోసం దేనికైనా రెడీ..కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook