AP Police Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గత ప్రభుత్వంలో ఆగిపోయిన పోలీస్‌ ఉద్యోగాల భర్తీతోపాటు త్వరలోనే మరికొన్ని ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే పోలీస్‌ ఉద్యోగాల భర్తీని పూర్తి చేస్తామని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం చేసిన నిర్వాకంపై దుమ్మెత్తిపోశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirumala Laddu Row: సుప్రీంకోర్టు నిర్ణయం మోదీ, చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్‌ షర్మిల


 


ఆంధ్రప్రదేశ్‌లో 2022లో సమయంలో పోలీస్‌ ఉద్యోగాల భర్తీ చేపట్టగా రెండేళ్లు పూర్తవుతున్నా ఇంకా పూర్తి కాలేదు. కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో హోంమంత్రి అనిత ఉద్యోగాల భర్తీపై మాట్లాడారు. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (పీఎంటీ,పీఈటీ) పరీక్షలను ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. 2022లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరుకాగా వాటిలో 95,209 మంది తదుపరి దశకు ఎంపికయ్యారరు. పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు కారణాల వాయిదా పడడంతో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ (సివిల్)- 3580; కానిస్టేబుల్ (ఎపీఎస్పీ)-2520 పోస్టుల ప్రక్రియ వాయిదా పడిందని గుర్తు చేశారు.

Also Read: APSRTC: దసర పండగ... ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ.. డిటెయిల్స్..


 


ప్రిలిమినరీ రాత పరీక్షకు మొత్తం 3,622 మంది హోంగార్డులు హాజరవగా వారిలో 382 మంది  అర్హత సాధించగా.. అర్హత సాధించని 100 మంది హోంగార్డులు 14 రిట్ పిటిషన్లను హైకోర్టులో వేసినట్లు హోంమంత్రి అనిత వివరించారు. హోంగార్డులను  ప్రత్యేక కేటగిరీగా పరిగణించి హోంగార్డుల కోటాలో ప్రత్యేక మెరిట్ జాబితాను ప్రకటించాలని కోర్టును కోరడంతో ఉద్యోగ ప్రకటన ఆగిపోయింది. అయితే 100 మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలని న్యాయస్థానం ఆదేశాలివ్వడంతో గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలిపివేసిందని గుర్తు చేశారు.


ఆగిపోయిన ఉద్యోగాల భర్తీపై న్యాయ సలహా తీసుకొని పూర్తిచేస్తామని హోంమంత్రి అని తెలిపారు. ఉద్యోగాల భర్తీలో రెండో దశ (పీఎంటీ/పీఈటీ)ను వెంటనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి రెండో దశకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామకాల బోర్డు (slprb.ap.gov.in)ను సందర్శించాలని సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా జరిపి వెంటనే ఉద్యోగాలను యువతకు ఇస్తామని హోంమంత్రి తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.