MLC KAVITHA: కవిత చేతికి బ్రహ్మాస్త్రం.. త్వరలోనే రీ ఎంట్రీ!

MLC KAVITHA: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్‌గా మళ్లీ యాక్టివ్‌ కాబోతున్నారా..! జైలు నుంచి విడుదలయ్యాక.. అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమైన కవిత.. ఇప్పుడు రేవంత్‌ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్దం చేస్తున్నారా..! ఈ అస్త్రంతో రేవంత్ సర్కార్‌కు ఇబ్బందులు తప్పవా.. ఇంతకీ కవిత పొలిటికల్‌ రిటర్న్‌ ఎలా ఉండబోతోంది..

Written by - G Shekhar | Last Updated : Nov 23, 2024, 08:42 PM IST
MLC KAVITHA: కవిత చేతికి బ్రహ్మాస్త్రం.. త్వరలోనే రీ ఎంట్రీ!

MLC KAVITHA: ఎమ్మెల్సీ కవిత పొలిటికల్‌గా మళ్లీ యాక్టివ్‌ అయ్యేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టై బెయిల్‌పై వచ్చిన కవిత కొద్దిరోజులుగా ఇంటికే పరిమితం అయ్యారు. జైలులో ఉండగా.. అనారోగ్య సమస్యలు ఎదురు కావడంతో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం కాస్తా మెరుగుపడటంతో త్వరలోనే బయటకు వస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు ఎలాంటి అస్త్రాలతో బయటకు వస్తారు.. రేవంత్ సర్కార్‌ను ఎలా ఎదుర్కొనబోతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

గత కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే జరుగుతోంది. ఇటీవల కల్వకుంట్ల కవిత నివాసంలో కూడా అధికారులు కులగణన సర్వే చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు కవితకు సంబంధించిన ఫొటోలు మీడియాకు రిలీజ్‌ చేశారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చాక.. కవిత మీడియా కంటపడకుండా తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కులగణనకు సంబంధించిన ఫొటోలు ఆమెనే స్వయంగా బయటకు పంపడంతో పొలిటికల్‌ రీ ఎంట్రీ కన్‌ఫర్మ్‌ అయినట్టేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో రేవంత్ సర్కార్‌పై కేటీఆర్‌, హరీష్‌ రావు వీరోచిత పోరాటం చేస్తున్నారు. సీఎం రేవంత్‌ను ప్రతి విషయంలోనూ ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలకు కవిత తోడైతే మరింత జోష్‌ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి..

ఇక లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టు బీఆర్‌ఎస్‌ పెద్ద దెబ్బ అని చెప్పాలి. కవిత అరెస్టు తర్వాత కేసీఆర్‌ కూడా సైలెంట్‌ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ లిక్కర్‌ స్కామ్‌లో కవిత పాత్రపై సీబీఐ ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. అయితే జైలు నుంచి బయటకు వస్తూనే మోడీ సర్కార్‌పై కవిత యుద్దం ప్రకటించారు. రానున్న రోజుల్లో మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆమె ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కవిత రీ ఎంట్రీపై రకరకాల ప్రచారం జరిగింది. కవిత రీ ఎంట్రీకి దసరాకు ఉంటుందని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా కవిత ఇంట్లో రెస్ట్‌ తీసుకుంటున్నారని ప్రకటించారు. ఇటీవల కవిత ఆరోగ్యం కుదుట పడంతో తిరిగి పాలిటిక్స్‌పై దృష్టి సారించారని త్వరలోనే ప్రజల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కవిత కులగణనకు సంబంధించిన ఫొటోలు బయటకు రిలీజ్‌ చేసినట్టు సమాచారం.

మరోవైపు కవిత గతంలో బీసీల పక్షాన పోరాటం చేశారు. ఫూలే ప్రంట్‌ ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం ప్రయత్నించారు. ఇప్పుడు ఇదే ఎజెండాగా కవిత ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ప్రతిరోజు బీసీ సంఘాల నేతలతో కవిత సమావేశం అవుతున్నారట. రాష్ట్రంలో బీసీల సమస్యలను అడిగి తెలుసుకుంటూ నోట్‌ చేసుకుంటున్నారట. అంతేకాదు బీసీల సమస్యలు పరిష్కారం కోసం వారి సలహాలు, సూచనలు సైతం తీసుకుంటున్నట్టు తెలిసింది. మరోవైపు తెలంగాణ జాగృతిని కూడా మళ్లీ యాక్టివ్‌ చేసే యోచనలో కవిత ఉన్నట్టు సమాచారం. గతంలో తెలంగాణ జాగృతి పేరుతో అనేక సేవ కార్యక్రమాలు కొనసాగించారు. కానీ కవిత జైలుకెళ్లాక జాగృతి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.. ఇప్పుడు జాగృతిని మరోసారి యాక్టివ్‌ చేసేందుకు జాగృతి నేతలతోనూ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

మొత్తంగా ఫూలే ఫ్రంట్‌ ఎజెండాతో కవిత ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కులగణనపై ఏర్పాటైన డెడికేటెడ్‌ కమిషన్‌ను కూడా కవిత కలవబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే తన వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌ కు ఇచ్చి సర్వేలు మార్పులు చేయాలని కోరబోతున్నారట. అయితే కవిత పెట్టే ప్రతిపాదనను కమిషన్‌ స్వీకరిస్తుందా లేదా అనేది అసక్తికరంగా మారింది.  అయితే కవిత రీ ఎంట్రీపై మాత్రం బీఆర్‌ఎస్‌ శ్రేణులు, నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ మాత్రం ఫుల్‌ ఖుషీ అవుతున్నట్టు సమాచారం.. చూడాలి మరి కవిత రీ ఎంట్రీ తెలంగాణ పాలిటిక్స్‌ను ఏమేర ప్రభావితం చేస్తుందో..!

Also Read: AP Politics: శ్రీకాళహస్తిలో టీడీపీ Vs వైసీపీ.. గుడివెనుక నా సామీ!

Also Read: GANDHI BHAVAN: గాంధీభవన్‌ కేరాఫ్‌.. జనతా గ్యారేజ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News