ట్రాన్స్ జెండర్స్ పాలసీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్స్ కి వరాలు ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన ట్రాన్స్ జెండర్స్ కి 1500 పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్స్ కి వరాలు ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన ట్రాన్స్ జెండర్స్ కి 1500 పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. వారికి అన్ని రకాల ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల మందికి పైగా ట్రాన్స్ జెండర్స్ ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
ట్రాన్స్ జెండర్లు సమాజంలో ఎటువంటి వివక్ష ఎదుర్కొరాదని.. వారికి విద్య, ఉద్యోగాల్లో వివక్ష చూపరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అందరిలాగే పరిగణించాలని.. రేషన్ కార్డు, ఇంటి స్థలాలు కూడా ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. కాగా సీఎం చంద్రబాబు కురిపించిన వరాలపై ట్రాన్స్ జెండర్లు హర్షం వ్యక్తం చేశారు.
* 2012-13 సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఆధారంగా ట్రాన్స్ జెండర్స్ పాలసీ.
* విభిన్న ప్రతిభావంతులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ శాఖకు అదనంగా ట్రాన్స్ జెండర్స్ పేరు.
* అన్ని సంక్షేమ కార్పొరేషన్లలో రుణాలు పొందే హక్కు.
* ప్రభుత్వ శాఖలకు చెందిన దరఖాస్తులో ట్రాన్స్ జెండర్స్ కాలమ్.