Semester System: ఏపీలో ఇక నుంచి సరికొత్త విధానం.. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ పద్ధతి
Semester System in Ap Govt Schools: ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెమిస్టర్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ పద్ధతిని ప్రవేశపెట్టనుంది.
Semester System in Ap Govt Schools: ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థ సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే అనేక కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టగా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ రెండు సెమిస్టర్‌లు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. పదో తరగతికి 2024-25 విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. రెండు సెమిస్టర్లకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను విద్యా సంవత్సరం ఆరంభంలోనే అందజేయనున్నారు. సెమిస్టర్ పద్ధతికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.
రాష్ట్ర విద్యా చరిత్రలో పాఠశాల స్థాయిలో సెమిస్టర్ విధానం ప్రవేశ పెట్టడం ఇది తొలిసారి. పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్లు వారీగానే తయారు చేసి.. విద్యార్థులకు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. సెమిస్టర్ విధానంతో విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. సిలబస్ మొత్తం ఒకేసారి చదివేందుకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్న తరుణంలో సెమిస్టర్ విధానం ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు. సెమిస్టర్ల వారీగా చదివితే.. సబ్జెక్ట్‌పై విద్యార్థులు మరింత పట్టు సాధిస్తారని అంటున్నారు.
సెమిస్టర్ విధానంతో ప్రభుత్వ పాఠశాల బోధనలో సరికొత్త శకం ఆరంభంకానుంది. మరోవైపు డిజిటల్ పాఠ్యాంశాలు బోధించేందుకు ఉచితంగా ట్యాబ్‌లను కూడా అందజేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ సంస్థకు ఈ-పాఠ్యాంశాలతో కూడిన ట్యాబ్‌లను రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలోని 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేయనునున్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21న ఈ ట్యాబ్‌లను అందజేయనున్నారు.
Also Read: Pension Scheme: ప్రతి నెల నేరుగా రూ.5 వేలు ఖాతాల్లోకి.. ఈ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Paleti RamaraoPaleti Ramarao Death Day InvitationDeath Day Invitation