AP Govt Employees Biometric: సచివాలయ ఉద్యోగులకు బిగ్‌షాక్.. బయోమెట్రిక్ రూల్స్ ఛేంజ్..!
Biometric Rules For Secretariat Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఇక నుంచి ప్రతి రోజూ కచ్చితంగా మూడుసార్లు బయోమెట్రిక్ వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ రూల్స్ సరిగా అమలుకావడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
Biometric Rules For Village and Ward Secretariat Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది రోజూ 3 సార్లు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశించింది. ఉ.10.30 గంటల కంటే ముందు, మధ్యాహ్నం.3 గంటలకు, సా.5 గంటల తర్వాత అటెండెన్స్ వేయాలని జీవో ఇచ్చింది. గతంలోనే ఈ రూల్స్ ఉండగా బయోమెట్రిక్ విధానం సరిగ్గా అమలు కావడం లేదన్న ఆరోపణలతో ఇక నుంచి కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు హాజరు ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించింది.
Also Read: Viral video: పెళ్లైన 2 నెలలకే ముఖేష్ అంబానీ చిన్నకోడలు రాధిక ప్రెగ్నెంట్..?.. ఈ వీడియో చూశారా..?
కాగా.. ఇటీవల అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల పరిధిలో ముట్టల గ్రామ సచివాలయంలో ఉద్యోగులు సమ పాలన పాటించలేదు. ఉదయం 11 గంటలు దాటినా.. ఇక్కడ ఒక మహిళా పోలీస్ తప్ప ఏ ఒక్కరు కూడా విధులకు హాజరు కాలేదు. ఇలానే చాలా చోట్ల సచివాలయ సిబ్బంది ఇష్టానుసారంగా వస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదు వెళ్లాయి. ఈ నెల 15వ తేదీలోపు ఆర్బీకే సెంటర్లలో ఈ పంట అప్లికేషన్స్ సమర్పించాల్సి ఉంది. ఇలా ఉద్యోగులు సమపాలన పాటించకపోతే ఎలా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Devara Trailer: దేవర ట్రైలర్ జాతర.. నటనతో జూ ఎన్టీఆర్ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోత
అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్‌లను నిర్వహించాల్సి ఉండగా.. ఉద్యోగుల అందుబాటులో ఉండడం లేదని చెబుతున్నారు. తాజాగా ప్రభుత్వం బయోమెట్రిక్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఇక నుంచి ఉద్యోగులు కచ్చితంగా సమయానికి హాజరుకావాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.