Viral video: పెళ్లైన 2 నెలలకే ముఖేష్ అంబానీ చిన్నకోడలు రాధిక ప్రెగ్నెంట్..?.. ఈ వీడియో చూశారా..?

Radhika merchant: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కోడలు.. రాధిక మర్చంట్ ప్రెగ్నెంట్ అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. 

Written by - Inamdar Paresh | Last Updated : Sep 10, 2024, 05:42 PM IST
  • ముఖేష్ ఇంట్లో మరో శుభవార్త..?..
  • రాధిక మర్చంట్ ప్రెగ్నెంట్ రూమర్స్..
Viral video: పెళ్లైన 2 నెలలకే ముఖేష్ అంబానీ చిన్నకోడలు రాధిక ప్రెగ్నెంట్..?.. ఈ వీడియో చూశారా..?

Radhika merchant nita ambani video viral: బిలియనీర్,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు అనంత్ పెళ్లి ఇటీవల ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. అనంత్ రాధిక మర్చంట్ ల పెళ్లి ముంబైలోని జియో కన్వెన్షలో జులై 12 న అంగరంగా వైభవంగా జరిగింది. ముఖేష్ ఫ్యామిలీ పెళ్లి అన్నిరంగాల నుంచి కూడా ప్రముఖులు హజరయ్యారు. మనదేశం నుంచి మాత్రమే కాకుండా.. విదేశాల నుంచి సైతం అతిథులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీరి పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది.

 

అంబానీ ఇంట పెళ్లి నభూతో.. న భవిష్యత్ అన్న విధంగా జరిగింది. ఇదిలా ఉండగా..  ముంబైలోని ముఖేష్ ఫ్యామిలీ.. ఆంటిలీయా నివాసంలో.. గణేష్ ఉత్సవాలను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ముంబైలోని ఆంటిలీయా నివాసంలో.. వినాయక చవితి ఉత్సవాలకు బాలీవుడ్ నుంచి అనేక మంది తరలి వచ్చారు. అదే విధంగా గణేష్ నిమజ్జనంను  కూడా ముఖేష్ ఫ్యామీలీ అంతే గ్రాండ్ గా నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అనంత్ సతీమణి..రాధిక మర్చంట్ ప్రెగ్నెంట్ అంటూ కూడా.. కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

 ఈ ఏడాది ముఖేష్ అంబానీ కుటుంబం.. కొత్త కొడలు వచ్చిన ఆనందంలో ఎంతో గ్రాండ్ గా చేసుకున్నారు. అనంత్ అంబానీని పెళ్లి చేసుకున్న తర్వాత రాధికా మర్చంట్ కు ఇదే తొలి వినాయక చవితి పండుగ. కాగా ఈ పండుగను కుటుంబమంతా ఫుల్ జోష్ గా జరుపుకున్నారు. ఈ వినాయక చవితి వేడుకలకు బాలీవుడ్ ప్రముఖుల రాకతో అంబాని అంటిలియా ఇళ్లు ఎంతో సందడిగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో..సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ గా మారింది.

దీనిలో.. రాధిక మర్చంట్ తన కడుపుపై చేతులు వేసి, హీల్స్ కు బదులుగా ఫ్యాట్ షూస్ ను వేసుకుని కన్పిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ వీడియోలో నీతా అంబానీ తన చిన్న కోడలు రాధికా మర్చంట్ పడిపోకుండా.. చేయి పట్టుకుంది. అంతేకాకుండా.. తన చిన్న కోడలును జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. దీన్ని చూసిన జనాలంతా రాధికా మర్చంట్ గర్భవతి అని ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇంకేముంది.. అంబానీ ఫ్యామిలీకి బెస్ట్ విషేస్ చెబుతున్నారు.

Read more: Viral video: బాప్ రే.. నరాలు తేగె ఉత్కంఠ.. చూస్తుండగానే మునిగిపోయిన కారు.. టాప్ మీద జంట.. వీడియో వైరల్..

ఈ వీడయో కింద.. రాధికా మర్చంట్ ప్రెగ్నెంట్ అని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. మరో నెటిజన్ 'రాధిక కచ్చితంగా ప్రెగ్నెంట్' అంటూ కామెంట్ పోస్ట్  చేశాడు. మరో యూజర్.. రాధిక ఆమె పొట్టమీద చెయ్యి పెట్టుకున్నారు.. చీర కట్టులో చాలా నిండుగా కన్పిస్తున్నారంటూ కూడా.. కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది.

Trending News