Schools reopening in AP: స్కూల్స్ పునఃప్రారంభం వాయిదా.. జగనన్న విద్యా కానుకపై క్లారిటీ
అక్టోబర్ 5న విద్యా సంస్థలు తెరవాలన్ననిర్ణయాన్ని ఏపీ సర్కార్ వాయిదా వేసుకుంది. వాస్తవానికి అక్టోబర్ 5 నుంచే విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని ( AP schools reopening ) తొలుత భావించినప్పటికీ.. కరోనావైరస్ ఇంకా తగ్గుముఖం పట్టనందున ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసుకుంటున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Adimulapu Suresh ) ప్రకటించారు.
అమరావతి: అక్టోబర్ 5న విద్యా సంస్థలు తెరవాలన్ననిర్ణయాన్ని ఏపీ సర్కార్ వాయిదా వేసుకుంది. వాస్తవానికి అక్టోబర్ 5 నుంచే విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని ( AP schools reopening ) తొలుత భావించినప్పటికీ.. కరోనావైరస్ ఇంకా తగ్గుముఖం పట్టనందున ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసుకుంటున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Adimulapu Suresh ) ప్రకటించారు. పాఠశాలల పునఃప్రారంభం నవంబర్ 2కు వాయిదా పడినప్పటికీ.. ముందుగా అనుకున్నదాని ప్రకారమే అక్టోబర్ 5నే జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభించి విద్యార్థులకు కిట్లను ( Jagananna vidya kanuka scheme ) అందజేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. Also read : కరోనా వల్ల AP EAMCET 2020 రాయలేదా.. అయితే మీకు గుడ్ న్యూస్
కరోనావైరస్ లాక్ డౌన్ ( Coronavirus lockdown ) కారణంగా మార్చి నుంచి విద్యా సంస్థలు మూతపడి ఉన్నాయి. ఐతే ఏపీలో పాఠశాలలను సెప్టెంబర్ 5 నుంచి పునఃప్రారంభించాలని తొలుత ఏపీ సర్కార్ భావించినట్టు వార్తలొచ్చినా.. అప్పట్లోనూ కరోనా విజృంభణకు తగ్గుముఖం పట్టకపోవడంతో అప్పట్లో అది సాధ్యపడలేదు. వీలైతే అక్టోబర్ 5న తిరిగి పాఠశాలలను ప్రారంభిస్తామని.. ఐతే తమ నిర్ణయం ఏదైనా అన్‌లాక్ 5 మార్గదర్శకాలు ( Unlock 5 guidelines ) వెలువడిన తర్వాతే ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆ మేరకే తాజా పరిస్థితినిబట్టి మరోసారి ఏపీ సర్కార్ తమ నిర్ణయాన్ని మార్చుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe