COVID-19, Black fungus కి ఉచిత వైద్యం అందించిన తొలి రాష్ట్రం ఏపీ: సీఎం జగన్
Free treatment for COVID-19 and Black fungus: అమరావతి: దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తీసుకురావడం ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రతీ రోజూ ఏపీలో 25 వేల మందికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా కరోనా చికిత్స అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
Free treatment for COVID-19 and Black fungus: అమరావతి: దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తీసుకురావడం ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రతీ రోజూ ఏపీలో 25 వేల మందికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా కరోనా చికిత్స అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. కొత్తగా బ్లాక్ ఫంగస్‌ను కూడా వ్యాపిస్తున్నందున ఆ వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చి పేదలకు ఆర్థిక భారం పడకుండా ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశంలో (AP Budget 2021 session) భాగంగా గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం జగన్ ఈ వివరాలు వెల్లడించారు. సీఎం జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం.
Also read: AP Budget Highlights: 2 లక్షల 29 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్, సంక్షేమానికి పెద్ద పీట
అంతేకాకుండా దేశంలో ఆక్సిజన్ ఎక్కడ లభించినా అక్కడి నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్నివిధాల కృషిచేస్తోందని, ఇకపై ఆక్సీజన్ సమస్యలు (Oxygen supply) ఎదురవకుండా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రంలోని బోధన ఆస్పత్రులు, సీ.హెచ్.సీల్లో కలిపి మొత్తం 53 ఆక్సిజన్ జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
Also read : Black fungus treatment: ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్ చికిత్స
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook