Normal levels of oxygen saturation: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కొద్దీ ఆక్సీజన్ సరఫరాకు డిమాండ్ పెరుగుతోంది. ఓవైపు దేశవ్యాప్తంగా ఆక్సీజన్ సరఫరాకు డిమాండ్ పెరుగుతోంటే.. మరోవైపు డిమాండ్‌కి తగినంత సప్లై లేక ఆక్సీజన్ అవసరమైన కొవిడ్-19 రోగులు పడుతున్న పాట్లు పెరిగిపోతున్నాయి. గతంలో రోగులకు మెడికల్ ఆక్సీజన్ అవసరమైతే.. వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రులే ఆ ఏర్పాట్లు చూసేవి. కానీ ఇప్పుడు ఆక్సీజన్‌కి కొరత ఏర్పడటంతో చాలామంది కరోనా రోగులు, వారి కుటుంబసభ్యులు ఆక్సీజన్ సరఫరా చేసే వారి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిలావుంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న కరోనా రోగులను కష్టాలను చూస్తున్న ఇతర కరోనా పేషెంట్స్, సాధారణ జనం ముందు జాగ్రత్తగా ఆక్సీజన్ శాచ్యురేషన్ లెవెల్స్‌పై (Normal oxygen saturation levels) అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ కరోనా వస్తే.. ఆక్సీజన్ శాచ్యురేషన్ లెవెల్స్ ఎంతవరకు ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండవు ? ఎలాంటి పరిస్థితుల్లో డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాలను వివరించే ప్రయత్నమే ఈ కథనం.
Also read : Corona Positive Cases: తెలంగాణలో కరోనా కల్లోలం, కోవిడ్-19తో తాజాగా 23 మంది మృతి
మెడికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న వివరాల ప్రకారం ఆక్సీజన్ లెవెల్స్ 94% కంటే ఎక్కువ ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. వాళ్లు సురక్షితంగా ఉన్నట్టే. అంతకంటే తక్కువకు పడిపోతే, అప్పుడు జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఇది పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారికి వర్తిస్తుంది. అలా కాకుండా వాళ్లు ఏదైనా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టయితే, వారిలో నార్మల్ ఆక్సీజన్ లెవెల్స్ వారి ఆరోగ్య సమస్యలపై ఆధారపడి ఉంటాయి.
ఉదాహరణకు సీవోపీడీ లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో (COPD or other lung diseases) బాధపడే వారిలో ఆక్సీజన్ లెవెల్స్ (Spo2) 88-92 మధ్యే ఉండటం అనేది సాధారణం అనే విషయాన్ని గ్రహించాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ గుర్తుచేస్తున్నారు. అంటే వీరిలో ఆక్సీజన్ లెవెల్స్ 94 % కంటే తక్కువగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నమాట.
Also read : COVID-19 vaccine తీసుకునే ముందు, తర్వాత ఎలాంటి Foods తినాలి ? ఏవి తినొద్దు ?
ఆక్సీజన్ లెవెల్స్ 94 కంటే తక్కువ పడిపోయినట్టయితే, అప్పుడు ముందు జాగ్రత్త కోసం డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడుతుందని నారాయణ హెల్త్ కేర్ చైర్మన్ డా దేవి శెట్టి సూచిస్తున్నారు.
ఆక్సీజన్ లెవెల్స్ పడిపోవడంతో పాటు ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు, అజీర్తి, వాంతులు (Body ache, cold, cough, indigestion, vomiting
) వంటి కరోనా లక్షణాలు (Corona second wave symptoms) కనిపించినట్టయితే.. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అని డా దేవి శెట్టి తెలిపారు. ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినట్టయితే, డాక్టర్‌ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని డా దేవి శెట్టి వైద్య సలహా ఇస్తున్నారు.
మెడికల్ ఆక్సీజన్ అవసరాలపై ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా గులెరియా మాట్లాడుతూ... ''ఆక్సీజన్ అవసరమైన వారికి అది ఎంతో ముఖ్యమే అయినప్పటికీ, ఆగుతూ ఆగుతూ లేదా అప్పుడప్పుడు ఆక్సీజన్ తీసుకోవడం అనేది కూడా ప్రాణ వాయువుని వృధా చేయడమే అవుతుంది'' అని అభిప్రాయపడ్డారు. ''ఆక్సీజన్ అనేది కూడా ఓ ఔషధం లాంటిదేనని, కరోనా సోకిన రోగులకు ఆక్సీజన్ (Oxygen suppliers contacts) అవసరమైతే వారికి ఆక్సీజన్ ఇవ్వడం అనేది కరోనా చికిత్సలో ఓ భాగమే అనేది గ్రహించాల్సిన విషయం'' అని డా గులెరియా పేర్కొన్నారు.
Also read : Surgical face mask vs 5-layered mask: సర్జికల్ మాస్క్ vs N95 మాస్క్.. కరోనా నుంచి సేఫ్టీ కోసం ఏది బెటర్ ?
కొంతమంది ఈ విషయంపై అవగాహన లేక తమకు ఏదో అయిపోతోందనే భయంతో ఆక్సీజన్ సిలిండర్స్ ఇంటి వద్దే పెట్టుకుని అర్థగంట లేదా 2 గంటలపాటు ఆక్సీజన్ ఉపయోగిస్తున్నారని.. అందువల్లే ఆక్సీజన్ అత్యవసరమైన వారికి లభించే పరిస్థితి లేకపోతుందనే కోణంలో డా గులేరియా చెప్పుకొచ్చారు. ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ డా రణదీప్ గులేరియా (Dr Randeep Guleria) ఈ వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook