How To Update Aadhaar: ఇప్పుడు ప్రతి పథకానికి, ప్రతి ప్రభుత్వ సేవకు ఆధార్‌ తప్పనిసరిగా మారింది. ఈ సమయంలో ఆధార్‌లో వివరాలు తప్పక నమోదు చేసుకోవాల్సి ఉంది. అందులో మార్పులు చేర్పులు చేసుకోకుంటే పథకాలు అందలేని పరిస్థితి. ఆధార్‌ అప్‌డేట్‌ లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆధార్‌ అప్‌డేట్‌ కేంద్రాలను నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా అప్‌డేట్‌ కేంద్రాలు నిర్వహించాలని నిర్ణయించింది. నాలుగు రోజుల పాటు ఈ కేంద్రాలు కొనసాగుతాయని వెల్లడించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: TDP JanaSena: పార్టీ వీడేవారికి చంద్రబాబు కీలక సూచన.. భవిష్యత్‌కు 'గ్యారంటీ' ప్రకటన


ఆధార్‌ కార్డు తీసుకుని పదేళ్లు తీసుకుని పదేళ్లు ముగిసిన వారి విషయంలో ఆధార్‌ ధ్రువీకరణ అధికారులు పలు మార్పులు చేశారు. కచ్చితంగా ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. అలాంటి వారు ఆంధ్రప్రదేశ్‌లో 1.49 మంది ఉన్నారు. వారంతా ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేసుకోలేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఆధార్‌ అప్‌డేట్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. ఫిబ్రవరి 20 నుంచి 23వ తేదీ వరకు ఈ కేంద్రాల్లో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

Also Read: New Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ.. స్థాపించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేస్తుందా?


ఎక్కడా?
రాష్ట్రంలో విప్లవాత్మకంగా అమలుచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఆధార్‌ అప్‌డేట్‌ సేవలను అందిస్తున్నారు. నాలుగు రోజుల పాటు స్థానికంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకునేందుకు వెళ్లవచ్చు. అయితే ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదు. ఆధార్‌ అప్‌డేట్‌తోపాటు అన్ని రకాల సేవలు ఉచితంగా పొందవచ్చు. 


అప్‌డేట్‌ అంటే..?
ఆధార్‌ కార్డు అంటే మీ గుర్తింపు కార్డు అని అర్ధం. భారత ప్రభుత్వం మీకు అందిస్తున్న గుర్తింపు కార్డుగా భావించవచ్చు. ఈ కార్డు ద్వారా మీ వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఆధార్‌ కార్డు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ఉంటేనే మీకు ప్రభుత్వ సేవలు అందే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు, సేవలు పొందాలనుకుంటే ఆధార్‌లో వివరాలు సరైనవి ఉండాలి. అవి తప్పు ఉంటే మీకు సేవలు అందకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే అప్‌డేట్‌ అనేది తప్పనిసరి చేస్తున్నారు.


ఆధార్‌ కార్డులో పేర్లు తప్పు ముద్రితమైనా.. నంబర్లు, చిరునామా మారినా, ఫొటో మార్చాలనుకోవాలన్నా ఇప్పుడు మార్చుకోవచ్చు. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం కేంద్రం ప్రత్యేకంగా కొన్ని రోజుల ప్రకటించింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతోపాటు మరిన్ని పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేస్తున్న నేపథ్యంలో ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంది. దీనికితోడు చాలా మంది ఆధార్‌ కార్డు ఉందనే విషయాన్ని కూడా మరచిపోయారు. ఆధార్‌ కార్డును వినియోగించడం మరిచారు. అలాంటి వారి వివరాలు అప్‌డేట్‌ లేవు. అప్‌డేట్‌ లేని వారి సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆధార్‌ అప్డేట్‌పై దృష్టి సారించాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook