Liberation Congress Party: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పుట్టుకు వచ్చింది. ఇప్పటికే మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఓ పార్టీ స్థాపించగా అదే మాదిరి ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్టీని స్థాపించారు. ఆయనెవరో కాదు మాజీ ఉన్నత అధికారి విజయ్ కుమార్. ఆయన స్థాపించిన పార్టీ పేరు 'లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ'. గుంటూరు కేంద్రంగా పార్టీని స్థాపించిన విజయ్ కుమార్ పార్టీ లక్ష్యాలు, పార్టీ కార్యాచరణ ప్రకటించారు.
Also Read: Ambati Rambabu: రేవంత్ రెడ్డి చట్టాన్ని గౌరవించనంటే ఎలా? ఏపీ మంత్రి అంబటి రాంబాబు నిలదీత
గుంటూరులోని బైబిల్ మిషన్ గ్రౌండ్స్‌లో 'అధిక జన మహా సంకల్పం' పేరుతో బుధవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ నుంచి మాజీ ఐఏస్ విజయ్ కుమార్ తన పార్టీని ప్రకటించారు. అయితే పార్టీ స్థాపించిన రోజే సంచలన ప్రకటన చేశారు. 'రానున్న ఎన్నికల్లో పార్టీ పోటీ చేయదు' అని ప్రకటించారు. అధిక జనుల ఐక్యతే లక్ష్యమని, తమతో కలిసి వ్చే నాయకులతో కలిసి భవిష్యత్‌లో ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొదటి రోజే సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు.
Also Read: Sharmila: జగనన్నకు చెల్లెమ్మ 9 ప్రశ్నలు.. 'దగా డీఎస్సీ'గా వర్ణించిన వైఎస్ షర్మిల
పేదల కోసం సీఎం జగన్ యుద్ధం చేస్తానంటున్నారు. కానీ పెత్తందార్లు దోచుకున్న భూములను పేదలకు ఇచ్చి నిజాయతీ చాటుకోవాలి' అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. దౌర్జన్యంగా లాక్కున్న భూములు, ఆస్తులు వారికి చెందేలా చట్టాన్ని మార్చారని ఆరోపించారు. సర్వే చేయించి అసలైన లబ్ధిదారులకు భూములు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో సక్రమంగా వైద్యం అందడం లేదని.. ఆస్పత్రులకు వెళ్లలేక గిరిజన మహిళలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసినట్లు చెప్పారు. త్వరలోనే వస్తుందని చెప్పారు.
విజయ్ కుమార్ ఎవరు?
ఐఏఎస్ అధికారిగా విజయ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్థాయిలో పని చేశారు. ఏపీలో తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కీలక శాఖల్లో బాధ్యతలు చేపట్టారు. గతంలో నెల్లూరు, ఒంగోలు, విజయవాడ కలెక్టర్‌గా పని చేశారు. కొన్నేళ్ల కిందట పదవీ విరమణ పొందిన విజయ్ కుమార్ మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుత అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా కొత్తగా పార్టీ స్థాపించడం విశేషం. అంతకుముందు 'ఐక్యత విజయపథం' పేరుతో ఏపీలోని పలు జిల్లాల్లో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. దళిత, గిరిజనులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం వారి ఐక్యత కోసం పార్టీని స్థాపించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook