AP IAS Officers: ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు.. ఎన్నికల ముంగిట ప్రభుత్వం కీలక నిర్ణయం
IAS Transfers: కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేసింది. అనూహ్యంగా అధికారుల బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మూడు, నాలుగు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం లభించింది.
IAS Officers Transfers: ఆంధ్రప్రదేశ్‌లో 21 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం, నంద్యాల, తిరుపతి, సీతారామరాజు జిల్లా కలెక్టర్లకు స్థానం చలనం కల్పించగా.. బదిలీ చేసిన అధికారులను వివిధ శాఖలకు పంపించింది. అధికారులను బదిలీ చేస్తూ ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
చర్చనీయాంశం
ఎన్నికల సమరశంఖం పూరించిన మరుసటి రోజే సీఎ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తే అధికార యంత్రాంగమంతా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది. అప్పుడు అధికారులను బదిలీ చేయడం అసాధ్యం. ఈ నేపథ్యంలోనే అనుకూలురైన అధికారులను నచ్చిన స్థానాల్లో ఏపీ ప్రభుత్వం బదిలీ చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. అకస్మాత్తుగా అధికారులను బదిలీ చేయడంపై ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
బదిలీలు ఇలా
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా మంజిర్ జిలానీ
అన్నమయ్య జిల్లా అభిషిక్త్ కిశోర్
నంద్యాల కలెక్టర్‌గా శ్రీనివాసులు (ప్రకాశం జాయింట్ కలెక్టర్)
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా భావన
పార్వతీపురం జాయింట్ కలెక్టర్‌గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విశాఖ జాయింట్ కలెక్టర్‌గా మయూర్ అశోక్
ప్రకాశం జాయింట్ కలెక్టర్‌గా ప్రవీణ్ ఆదిత్య
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్
విజయనగరం జాయింట్ కలెక్టర్‌గా కార్తీక్
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా రోణంకి కూర్మనాథ్
విశాఖ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్‌గా కేఎస్ విశ్వనాథం
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వెంకటరమణారెడ్డి (తిరుపతి కలెక్టర్)
శ్రీకాకుళం కమిషనర్‌గా తమీమ్ అన్సారియా
పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఇల్లకియా
సర్వే సెటిల్‌మెంట్ ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్‌గా గోవిందరావు
ఏపీయూఎఫ్‌ఐడీసీ మేనిజింగ్ డైరెక్టర్‌గా హరిత
తిరుపతి కమిషనర్‌గా అదితి సింగ్
పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ కార్యదర్శిగా రేఖారాణి
Also Read: Seethakka: కేటీఆర్ పెంపుడు కుక్కల కోసం రూ.12 లక్షలా? మంత్రి సీతక్క విస్మయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook