రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఉండే వారికి తెలియాల్సిన విషయం
కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రెడ్‌జోన్, కంటైన్‌మెంట్ క్లస్టర్లలో ఉన్నవారిలో ఎవరికైనా శ్వాస అందక ఇబ్బుందులు పడినా, లేదా ఫ్లూ లాంటి కరోనా లక్షణాలు కనిపించినా తక్షణమే 104కు ఫోన్ చేయాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రెడ్‌జోన్, కంటైన్‌మెంట్ క్లస్టర్లలో ఉన్నవారిలో ఎవరికైనా శ్వాస అందక ఇబ్బుందులు పడినా, లేదా ఫ్లూ లాంటి కరోనా లక్షణాలు కనిపించినా తక్షణమే 104కు ఫోన్ చేయాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న ప్రాంతాలకు డాక్టర్లను పంపి అక్కడే వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. శనివారం జవహార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని అన్నారు. ప్రతీ 10 లక్షల మందిలో 1,147 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని... అలా ఇప్పటివరకు చేసిన కోవిడ్-19 పరీక్షల్లో 60,250 మందికి నెగెటివ్ అని వచ్చిందన్నారు.
Also read : Liquor sales : మద్యం ప్రియులకు మళ్లీ నిరాశే
కరోనా రోగుల శరీరంలో శాచ్యూరేషన్ లెవల్స్ తగ్గుతుండటంపై ప్రత్యేక దృష్టిసారించామని చెప్పిన జవహార్ రెడ్డి.. కరోనా వ్యాధిగ్రస్తులకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్, శాచ్యూరేషన్ లెవెల్స్‌ను పరిశీలిస్తూ అవసరమైన వారికి వెంటనే అందించాలని కోవిడ్ ఆస్పత్రులకు సూచించినట్టు తెలిపారు. అంతేకాకుండా కరోనా బాధితుల ఆరోగ్య పరిరక్షణ, పర్యవేక్షణ కోసం సర్కార్ 1,174 మంది వైద్య నిపుణులను నియమించినట్లు పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..