Liquor sales : మద్యం ప్రియులకు మళ్లీ నిరాశే

లాక్ డౌన్ నేపథ్యంలో సాధారణ దుకాణాలు, అన్ని వ్యాపారాలతో పాటే బార్ అండ్ రెస్టారెంట్స్, మద్యం దుకాణాలు కూడా మూత పడిన నేపథ్యంలో లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు ఎత్తేస్తారా ? ఎప్పుడెప్పుడు మళ్లీ గొంతు తడిచేసుకోవచ్చా అన్న చందంగా మద్యం ప్రియులు ఎదురుచూశారు.

Last Updated : Apr 25, 2020, 09:32 PM IST
Liquor sales : మద్యం ప్రియులకు మళ్లీ నిరాశే

హైద‌రాబాద్‌: లాక్ డౌన్ నేపథ్యంలో సాధారణ దుకాణాలు, అన్ని వ్యాపారాలతో పాటే బార్ అండ్ రెస్టారెంట్స్, మద్యం దుకాణాలు కూడా మూత పడిన నేపథ్యంలో లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు ఎత్తేస్తారా ? ఎప్పుడెప్పుడు మళ్లీ గొంతు తడిచేసుకోవచ్చా అన్న చందంగా మద్యం ప్రియులు ఎదురుచూశారు. లాక్ డౌన్ ఎత్తేయగానే మళ్లీ ఎప్పుడు ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందో కనుక ఈసారి ముందస్తు జాగ్రత్తగా స్టాక్ కొని పెట్టుకోవాలని భావించిన వాళ్లూ కూడా లేకపోలేదు. ఇదే విషయమై సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో దర్శనమిచ్చిన పోస్టులే అందుకు నిదర్శనం. అంతేకాదు.. ఇంకొందరైతే.. మద్యం దూరమయ్యాకా పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించిన ఘటనలు కూడా అనేకం వెలుగుచూశాయి. అలా లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్క జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా ఫీలవుతున్న వాళ్లంతా లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా అనే ఎదురుచూస్తున్నారు. ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే, వారి ఎదురుచూపులకు ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందా అంటే అందుకు సమాధానం చెప్పడం కష్టమేనని తెలుస్తోంది. అందుకు ఓ కారణం లేకపోలేదు.

Also read : 24 గంటల్లో 1,490 కరోనా పాజిటివ్ కేసులు, 56 మంది మృతి

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా  లాక్ డౌన్‌పై కొన్ని ఆంక్షలను సడలించింది. కొన్ని రకాల వ్యాపారాలు, దుకాణాలు తిరిగి తెరుచుకునేందుకు వెస‌ులుబాటు క‌ల్పించింది. అయితే మరి మద్యం దుకాణాలు కూడా తిరిగి ప్రారంభిస్తారా ? మద్యం అమ్మకాలకు వీలు కల్పిస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి పుణ్య స‌లిలా శ్రీవాత్స‌వ్ ఈ విషయంపై స్పందిస్తూ.. తాము ఇచ్చిన ఆదేశాలు కేవ‌లం నిత్యవసరాలు, ఇతర వ‌స్తువుల‌ను అమ్మే దుకాణాలకు మాత్ర‌మే వర్తిస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, రద్దీ లేని చోట్ల దుకాణాలు తెరుచుకోవ‌చ్చు అని తెలిపారు. హెయిర్ సెలూన్స్, షాపింగ్ మాల్స్‌కి ప్ర‌స్తుతం ఎటువంటి మినహాయింపు లేద‌న్నారు. అలాగే మ‌ద్యం దుకాణాలు కూడా తెరిచేందుకు ఇంకా ఆదేశాలు వెలువడలేదని పుణ్య స‌లిలా శ్రీవాత్స‌వ్ స్ప‌ష్టం చేశారు. 

Also read : లాక్ డౌన్ తర్వాత ఈ మెట్రోలో ఇవి తప్పనిసరి

పట్టణ ప్రాంతాల విషయానికొస్తే.. కంటెన్మెంట్ జోన్ల‌ను మినహాయించి మిగితా ప్రాంతాల్లో యధావిధిగా దుకాణాలు తెరుచుకునేందుకు వీలు ఉందన్నారు. అయితే, సోషల్ డిస్టన్సింగ్ లక్ష్యాన్ని మాత్రం అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని.. సామాజిక దూరం పాటించాలనే లక్ష్యంతోనే అన్నిరకాల వ్యాపారాలకు అనుమతి ఇవ్వలేదన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News