AP Government: ఏపీలో ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు, పదవ తరగతి పరీక్షలు
AP Government: ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 3 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. మరోవైపు పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
AP Government: ఏపీలో ఒంటి పూట బడులు, పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక విషయాలు వెల్లడించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఏప్రిల్ 3 నుంచి ఒక పూటే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ విద్యార్ధులు ఎదురుచూస్తున్న ఒంటి పూట బడుల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉదయం 7.30 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకూ స్కూల్స్ నడుస్తాయని చెప్పారు. మరోవైపు పదవ తరగతి పరీక్షల ఏర్పాట్ల గురించి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల 9 వేల 70 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారని..ఈ ఏడాది నుంచి 6 పేపర్ల విధానంలోనే పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 18 వరకూ పరీక్షలు జరగనున్నాయి.
పదవ తరగతి విద్యార్ధుల కోసం పరీక్ష కేంద్రాలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్‌లకు అనుమతి ఉండదని..నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్‌లోకి అనుమతించేది లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వ టీచర్లు మాత్రమే వ్యవహరించనున్నారు. సెల్ ఫోన్, స్మార్ట్ పరికరాల్ని ఇన్విజిలేటర్లు సైతం తీసుకెళ్లకూడదు. పరీక్షల నిర్వహణకు 800 స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్ధుల కోసం తాగునీటి సదుపాయం ఏర్పాటైంది.
Also read: Ys jagan Delhi Tour: ఎపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరుస ఢిల్లీ పర్యటనలు, ఆ రెండు అంశాలే ఎజెండా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook