Maritime India 2021: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఖమైన తీరమే దీనికి కారణమని మారిటైమ్ ఇండియా 2021 సదస్సు నేపధ్యంలో తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తూర్పు తీరంలో సుదీర్ఘమైన తీరప్రాంతమున్నది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే.  గుజరాత్, మహారాష్ట్రలో ఉన్న తీరప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి అవకాశం తక్కువ. ఏపీలోని తీరప్రాంతం( Ap coastal area )లో పారిశ్రామిక అభివృద్ధి ( Industrial development)కి మెరుగైన అవకాశాలున్నాయి. మారిటైమ్ ఇండియా 2021 ( Maritime india 2021)సదస్సు నేపధ్యంలో ఆయన మాట్లాడారు. 2023 డిసెంబర్ నాటికి రామాయంపాడు పోర్టు అందుబాటులో వస్తుందని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. 2030 నాటికి దేశ ఎగుమతుల్లో రాష్ట్రం వాటాను పది శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుందన్నారు. తూర్పుతీరంలో రాష్ట్రానికున్న సుదీర్ఘమైన తీరప్రాంతం అదనపు అవకాశాల్ని కల్పిస్తుందన్నారు. 


కేంద్ర ప్రభుత్వం కొత్తగా మారిటైమ్ పాలసీ 2030 (Maritime policy 2030) తీసుకొచ్చింది. మారిటైమ్ నావిగేషన్, మానిటరింగ్ యాప్‌ను ఈ సందర్బంగా కేంద్రం ఆవిష్కరించింది. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల ద్వారా అదనంగా 100 మిలియన్ టన్నుల కార్గో రవాణా సామర్ధ్యం పెరుగుతుందన్నారు. పోర్టు ఆధారిత పారిశ్రామిక నగరాలు, పరిశ్రమలు పెరగనున్నాయని..లైట్‌హౌస్‌ల చుట్టూ పర్యాటక అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ( Minister Goutham reddy) తెలిపారు. 


Also read: Ap cm ys jagan: వైద్య సిబ్బందికి వేతనాలు పెంచిన ఏపీ ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook