Heavy Rains: ఏపీలో మరో రెండ్రోజులు ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీకు వచ్చే రెండ్రోజులు భారీ వర్షసూచన జారీ అయింది.
Heavy Rains: బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. మరోవైపు ఈశాన్య రుతు పవనాలు వీస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనుండగా, ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు. ఏపీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
దక్షిణ భారతదేశంలోని పలుప్రాంతాలకు మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరిక జారీ ఆయింది. ప్రస్తుతం బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు దక్షిణాదివైపు వీస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణాదిలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండ్రోజులు ఏపీలో వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.
ఇక ఇవాళ, రేపు అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, పార్వతీపురం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు సైతం పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న రాత్రి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోస్తా, ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు పడవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, అల్ప పీడనం కారణంగా ఇవాళ్టి నుంచి రెండ్రోజులు మోస్తరు లేదా భారీ వర్షాలు పడవచ్చు.
Also read: ఏలూరులో టీడీపీ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook