Ap High Court: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఇవాళ అత్యంత కీలకమైన పరిణామం జరిగింది. చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్న క్వాష్ పిటీషన్‌పై విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ వెలువరించింది. రెండ్రోజులుగా ఉత్కంఠ రేపిన ఏపీ హైకోర్టు తీర్పు వెలువడింది. చంద్రబాబు క్వాష్ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో సీఐడీ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. క్వాష్ పిటీషన్ కొట్టివేస్తున్నట్టుగా ఏకవాక్యంతో ఏపీ హైకోర్టు కొట్టివేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు సిద్ఱార్ద్ లూథ్రా, హరీష్ సాల్వేలు వాదనలు విన్పించారు. మరోవైపు సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించిన సెక్షన్ 17ఏను ఏపీ హైకోర్టు పరిగణలో తీసుకోలేదని తెలుస్తోంది. సీఐడీ వాదనలతో ఏకీభవిస్తూ..పిటీషన్ డిస్మిస్డ్ అంటూ ఏకవాక్యంతో కేసు కొట్టివేసింది.


క్వాష్ పిటీషన్ కొట్టివేయడంతో ఇక సీఐడీ కస్టడీ విషయంలో ఏసీబీ కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. సీఐడీకు కస్టడీ ఇస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఎఫ్ఐఆర్ ప్రాధమిక దశలో ఉన్నప్పుడు, ఈ కేసులో ఇంకా నిజానిజాలు వెలికితీయాల్సి ఉన్నందున క్వాష్ పిటీషన్‌లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హైకోర్టు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు స్వేచ్ఛనివ్వాలని హైకోర్టు అభిప్రాయపడింది. సీఐడీ 140 మందిని విచారించిన దశలో దర్యాప్తు ఆపమని చెప్పలేమన్నారు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి. ఈ కేసులో హైకోర్టు మినీ ట్రయల్ చేయజాదలదన్నారు. 


Also read: Chandrababu Case Updates: రిమాండ్ కొట్టివేతా లేక కస్టడీనా, మరి కాస్సేపట్లో ఉత్కంఠతకు తెర



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook