Ration door delivery: రేషన్ డోర్ డెలివరీకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, ఎన్నికల కమీషనర్ ఆదేశాలపై స్టే
Ration door delivery: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇంటింటికీ రేషన్ పధకం కొనసాగించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమీషనర్ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది,
Ration door delivery: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇంటింటికీ రేషన్ పధకం కొనసాగించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమీషనర్ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది,
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలు ( Ap panchayat elections ) కొనసాగుతున్నాయి. మరోవైపు మన్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడదలైంది. ఈ నేపధ్యంలో ఎస్ఈసీకు ఏపీ హైకోర్టు ( Ap High cout ) షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ( Ap Government ) ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రేషన్ డోర్ డెలివరీను నిలిపివేయాలని..రేషన్ డెలివరీ వాహనాల రంగుల్ని మార్చాలని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh kumar ) ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఈసీ ఆదేశాల్ని సవాలు చేస్తూ ఏపీ పౌర సరఫరాల శాఖ హైకోర్టును ఆశ్రయించారు. ఇంటింటికీ రేషన్ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమీషనర్‌ను ఆదేశించాలని కోరింది. రేషన్ డోర్ డెలివరీ అనేది నిరంతర ప్రక్రియ అని..పేదవారి కోసం ఉద్దేశించినదంటూ సమర్ధవంతంగా వాదన విన్పించింది.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ..ఎన్నికల కమీషనర్ ( SEC ) ఆదేశాలపై స్టే విధించింది. రేషన్ డోర్ డెలివరీ ( Ration door delivery )కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు రేషన్ వాహనాల రంగు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై స్టే విధించింది. మార్చ్ 15 వరకూ మథ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెబుతూ..మార్చ్ 15కు తదుపరి విచారణ వాయిదా వేసింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో తక్షణం రేషన్ డోర్ డెలివరీకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాల్లో ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఇక యధేచ్ఛగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం రేషన్ డెలివరీ జరగనుంది.
Also read: Ap municipal Elections: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్చ్ 10న పోలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook