Ap High Court: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా అభియోగాలు ఎదుర్కొంటున్న నారా లోకేశ్‌ను విచారణకు హాజరుకావల్సిందిగా సీఐడీ 41ఏ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్ని సవాలు చేస్తూ లోకేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమరావతి ఇన్నర్ కేసులో విచారణకు హాజరుకావల్సిందిగా సీఐడీ జారీ చేసిన 41 ఏ నోటీసుల్ని సవాలు చేస్తూ లోకేశ్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్‌లో షేర్ హోల్డర్ అని, ఆయనకు తీర్మానాలు, బ్యాంక్ ఎక్కౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీకు ఓ విధానం ఉంటుందని లోకేశ్ తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే తామేమీ డాక్యుమెంట్లపై ఒత్తడి చేయమని, రేపు విచారణకు హాజరుకావాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. అంత తొందరేముందని లోకేశ్ తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు అడిగారు. 


అటు లోకేశ్, ఇటు సీఐడీ తరపు వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరుకావల్సిందేనని లోకేశ్‌కు స్పష్టం చేసింది. ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటల్నించి సాయంత్రం 5 గంటల వరకూ లోకేశ్ విచారణకు హాజరుకావాలని కోరింది. మద్యాహ్నం లంచ్ బ్రేక్ ఇవ్వాలని హైకోర్టు తెలిపింది.


ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అవకతవకలు జరిగాయని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువ పెంచుకునేందుకే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ మార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. 


Also read: Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణ వాయిదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook