Quash Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. హైకోర్టుకు సమర్పించిన పత్రాలన్నింటినీ సోమవారం కోర్టులో సమర్పించాలని జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఆదేశించింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుధ్ బోస్ బెంచ్ ముందు విచారణ జరిగింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్ధ్ లూథ్రా, అబిషేక్ సింఘ్విలు వాదించగా, ఏపీసీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించారు. ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా వాదనలు కొనసాగాయి. రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని, ఇందులో సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా లేదా అనేది ప్రధానమని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే తెలిపారు. ఆరోపణలు ఎప్పటివని కాకుండా కేసు నమోదు, విచారణ ఎప్పుడనేది చర్చించాలని హరీష్ సాల్వే వాదించారు.
ఇక అవినీతి నిరోధక చట్ట సవరణలో ప్రతి పదం సునిశితంగా పరిశీలించి నిర్దారించారని మరో న్యాయవాది అభిషేక్ సింఘ్వి నివేదించారు. కేబినెట్ నిర్ణయాలకు ముఖ్యమంత్రి ఒక్కరే బాధ్యులు కారని చెప్పారు. అధికార నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలకు ప్రతీకార చర్యల గురించి 17ఏ రక్షణ కల్పిస్తుందన్నారు.
ఏపీసీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. 2018 జూలైలో 17ఏ చట్ట సవరణ చేయగా, 2021లో కేసు నమోదైందని సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. 2017లోనే కేసు మూలాలున్నందున సెక్షన్ 17ఏ వర్తించదన్నారు. 17ఏ చట్ట సవరణ జరగడానికి ముందే స్కిల్ కేసులో విచారణ జరిగిందనేందుకు ఆధారాలున్నాయా అని సీఐడీని కోర్టు ప్రశ్నించింది.
Also read: Times Now Survey: మళ్లీ ఫ్యాన్‌దే హవా, ప్రభావం చూపని బాబు అరెస్ట్, జనసేన పొత్తు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook