E Watch app: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మున్సిపల్ ఎన్నికల్లో వినియోగించుకునేందుకు వీలులేకుండా ఈ వాచ్ యాప్‌ను పూర్తిగా నిలిపవేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నిక(Ap local body elections)ల్లో అక్రమాలపై ఫిర్యాదుల కోసం  ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (Sec Nimmagadda Ramesh kumar)తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్‌(E Watch app)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవానికి పంచాయితీ ఎన్నికల సమయంలోనే ఎస్ఈసీ ఈ వాచ్ యాప్‌ను ప్రవేశపెట్టారు. అయితే ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నిఘా యాప్ వాడకుండా ప్రైవేటుగా ఈ వాచ్ అభివృద్ధి చేశారని ప్రభుత్వం (Ap government) వాదించింది. అప్పట్లో పంచాయితీ ఎన్నికలయ్యేంతవరకూ ఈ వాచ్ యాప్ వాడకుండా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు తుది విచారణను వాయిదా వేసింది. 


ఈసారి ఈ వాచ్ యాప్‌పై పూర్తి స్థాయి విచారణ జరిగింది. అధికారపార్టీని టార్గెట్ చేసేందుకే యాప్ తీసుకొచ్చారనేది ప్రధాన ఆరోపణ. మరోవైపు ఎన్నికల సంఘం ప్రైవేటుగా యాప్ అభివృద్ధి చేయడం నిబంధనలకు, ప్రైవసీకు వ్యతిరేకం. ఇప్పటికీ ఈ వాచ్ యాప్‌కు సాంకేతిక అనుమతులు రాకపోవడం, కోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు ఎస్ఈసీ (SEC) తరపు న్యాయవాది సరైన సమాధానం ఇవ్వ లేకపోయారు. దాంతో ఈ వాచ్ యాప్‌ను పూర్తిగా నిలిపివేస్తూ హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై విచారణ కూడా ఇంతటితో ముగిసిందని స్పష్టం చేసింది. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ వాచ్ యాప్ వాడకంపై అభ్యంతరాలుంటే మరోసారి కోర్టును సంప్రదించవచ్చని పిటీనర్లకు తెలిపింది.  హైకోర్టు ఈ వాచ్ యాప్(E Watch app)‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు తుది ఆదేశాలివ్వడంతో యాప్‌ను మున్సిపల్ ఎన్నిక( Municipal elections) ల్లో వినియోగించుకోవాలని భావించిన ఎన్నికల కమీషన్‌కు ఎదురు దెబ్బ తప్పలేదు. 


Also read: Maganti Ramji Death News: మాగంటి రాంజీ మృతి పట్ల Chandrababu తీవ్ర దిగ్భ్రాంతి, TDPకి తీరని లోటు అని ట్వీట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook