AP Municipal Elections 2021: ఏపీలో ముగిసిన మున్సిపల్ ప్రచారం, ఏలూరు ఎన్నికను నిలిపివేసిన హైకోర్టు
AP Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన ఘట్టం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీల ఎన్నికలకు సంబంధించి ప్రచారపర్వం ముగిసింది. మరోవైపు చివరి నిమిషంలో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికను హైకోర్టు నిలిపివేసింది.
AP Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన ఘట్టం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీల ఎన్నికలకు సంబంధించి ప్రచారపర్వం ముగిసింది. మరోవైపు చివరి నిమిషంలో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికను హైకోర్టు నిలిపివేసింది.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో(Ap Municipal Elections) కీలకమైన ప్రచారపర్వం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. రాష్ట్రంలో విజయనగరం, గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటురు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లతో పాటు 75 మున్సిపాల్టీలు, నగర పంచాయితీలకు మార్చ్ 10 వతేదీన పోలింగ్ జరగనుంది. హోరాహోరీ ప్రచారానికి తెరపడింది. మార్చ్ పదవ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. మార్చ్ 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఇప్పటికే కొన్ని స్థానాల్ని ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ..మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై ధీమాగా ఉంది.
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఏపీ హైకోర్టు(Ap High Court) బ్రేక్ వేసింది. చివరి నిమిషంలో ఏలూరు ఎన్నికల్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏలూరు కార్పొరేషన్‌కు సంబంధించి ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజన, జనగణన, కులగణన సరిగ్గా లేదనే అంశంపై దాఖలైన పిటీషన్‌పై విచారణ జరిపిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also read: Vizag steel plant privatisation: ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గేది లేదంటున్న కేంద్ర ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook