ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష కూడా ఇదే అంశంపై జరిగింది. ఇప్పుడు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య పిటీషన్‌తో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో మాజీ మంత్రి హరిరామజోగయ్య గత ఏడాది డిసెంబర్ నెలలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన లేకపోవడంతో జనవరి 1వ తేదీ నిరాహార దీక్షకు దిగారు. ఆ తరువాత ఆయను పోలీసులు అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో సైతం హరిరామజోగయ్య దీక్ష కొనసాగించడంతో..జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు హరిరామజోగయ్య జనవరి 2వ తేదీనే దీక్ష విరమించేశారు. 


ఆ తరువాత కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ జనవరి 6వ తేదీన ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి హరిరామజోగయ్య. ఈ పిటీషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కాపులు ఇప్పటికీ ఆర్ధికంగా వెనుకబడి ఉన్నారని..కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్ కేటగరీ రిజర్వేషన్ 10 శాతంలో 5 శాతం కాపులకు కేటాయించాలని పిటీషనర్ కోరారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తే..ఆర్ధికంగా బలోపేతమౌతారని ప్రభుత్వం భావిస్తున్నందునే ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని పిటీషనర్ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు విచారణను జనవరి 20వ తేదీకు వాయిదా వేసింది. మరోవైపు ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించించింది ఏపీ హైకోర్టు.


Also read: Minister Gudivada Amarnath: నువ్వు రాజకీయాల్లో బచ్చావి.. మంత్రి అమర్‌నాథ్‌కు హరిరామజోగయ్య లేఖ.. వెంటనే స్ట్రాంగ్ రిప్లై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook