Chandrababu Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోరులో నిరాశ ఎదురైంది. అదే సమయంలో సీఐడీ కస్డడీ విషయంలో స్వల్ప ఊరట లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడికి నిన్న ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్ కస్డడీ పిటీషన్ కొట్టివేసింది. అదే సమయంలో ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ఇవాళ విచారణకు వచ్చింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఐడీని ఆదేశిస్తూ విచారణను వారం రోజులు వాయిదా వేసింది. అంటే ఈ కేసులో విచారణ ఈనెల 19 వరకూ జరగదు. ఈ సందర్భంగా ఈ కేసు విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి తాను గతంలో పీపీగా పనిచేసినందున అభ్యంతరాలుంటే చెప్పాలని కోరారు. అభ్యంతరముంటే వేరే బెంచ్‌కు మారుస్తానన్నారు. అయితే చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా మాత్రం అభ్యంతరం లేదన్నారు. 


కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరగా ఏపీ హైకోర్టు వారం రోజులు గడువిచ్చి ఈ నెల 19వ తేదీకు విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వద్దని చంద్రబాబు తరపు న్యాయవాదాలు కోరడంతో ఈ నెల 18 వరకూ విచారణ చేపట్టవద్దని ఏపీ హైకోర్టు ఏసీబీ కోర్టుకు ఆదేశించింది.


స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐర్, ఏసీబీ రిమాండ్ ఉత్తర్వుల్ని కొట్టివేయాలని చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఇవాళ ఆ విచారణను న్యాయమూర్తి 19వ తేదీకి వాయిదా వేశారు. రిమాండ్ రిపోర్టులో అవకతవకలున్నాయని, ఏ విధమైన రుజువుల్లేవని, ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని చంద్రబాబు పిటీషన్‌లో తెలిపారు.


Also read: Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వర్ష సూచన



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook