Ap High court: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తాజా ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఏకగ్రీవాలపై విచారణకు ఆదేశించే హక్కు ఎక్కడిదంటూ కోర్టు ప్రశ్నించడం సంచలనంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల( Ap Panchyat elections)ప్రహసనం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి. దాదాపుగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబడుతూ వస్తోంది. ఇప్పటికే ఎన్నికల కమీషనర్‌పై పరిధి దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. ఏకగ్రీవాల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించి ఎన్నికల కమీషనర్ భంగపడ్డారు. 2020లో అర్ధంతరంగా ఆగిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో  బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపజేశారని నిర్ధారణైతే ఆ నామినేషన్లను పునరుద్ధరించాలని ఎన్నికల కమీషనర్ ఫిబ్రవరి 18న జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆరడిగుంట, సింగిరిగుంట ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఫాం 10 అందుకున్న డి.నంజుండప్ప, ఏ.భాస్కర్‌రెడ్డిలు ఈ ఆదేశాల్ని సవాలు చేస్తూ హైకోర్టు ( High Court )లో పిటిషన్‌ దాఖలు చేశారు. పీలేరు ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఫాం 10 అందుకున్న ఏటీ రత్నశేఖర్‌రెడ్డి కూడా మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. లంచ్‌ మోషన్‌ రూపంలో దాఖలైన ఈ వ్యాజ్యాలపై విచారణ జరిగింది. 


రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ( Article 243k ) ప్రకారం తన అధికారాలకు అడ్డులేదని ఎన్నికల కమీషనర్ భావిస్తున్నట్టు పిటీషనర్ తరపు న్యాయవాది వాదన విన్పించారు. రిటర్నింగ్ అధికారులు ఏం చేయాలనేది నిబంధనల్లో స్పష్టంగా ఉందని..వారి విదుల్లో ఎస్ఈసీ జోక్యం చేసుకోడానికి వీల్లేదని వివరించారు. ఒకే అభ్యర్ధి బరిలో ఉన్న పక్షంలో వెంటనే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తూ ఫాం 10 జారీ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( SEC Nimmagadda Ramesh Kumar )చట్టాల్ని కాదని సూపర్ మ్యాన్ లా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీనికి స్పందించిన హైకోర్టు వాదనలో జోక్యం చేసుకుంది. ఏకగ్రీవాలపై విచారణకు ఆదేశించే అధికారం ఎన్నికల కమీషనర్‌కు ఉందా ? ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ?  అని కోర్టు ప్రశ్నించింది. చట్టంలో ఏ విషయం చెప్పనప్పుడు మాత్రమే ఆర్టికల్ 243 కే వర్తిస్తుందని సుప్రీంకోర్టు( Supreme court ) గతంలో చెప్పిన సందర్భాన్ని కోర్టు గుర్తు చేసింది. ఈ విషయంలో క్షుణ్ణంగా విచారణ జరపాల్సిన అవసరముందని భావించిన కోర్టు..పిటీషనర్లు ప్రస్తావించిన అంశాలకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టం చేసింది.


ఒకేఒక నామినేషన్ దాఖలైన చోట ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ఫాం10 జారీ చేసిన ఏకగ్రీవాలపై ఫిబ్రవరి 23 వరకూ ఎలాంటి విచారణ జరపవద్దని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఫాం 10 జారీ చేయని చోట ఏమైనా చర్యలు తీసుకుంటే ఈనెల 23 వరకూ వెల్లడించకూడదని హైకోర్టు ఉత్తర్వులు( High court interim orders ) జారీ చేసింది. తదుపరి విచారణను 23వ తేదీకు వాయిదా వేసింది. 


Also read: Polavaram project: పోలవరం పనులపై డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సంతృప్తి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook