AP Inter Results 2021: ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను రాష్ర్ట విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అందరూ పాస్ అయినట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు చివరి నిమిషం వరకు శతవిధాల ప్రయత్నించిన ఏపీ ప్రభుత్వం.. కరోనా వ్యాప్తి మధ్య పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని సుప్రీం కోర్టు (Supreme court) చేసిన హెచ్చరికలతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AP Inter 2021 evaluation: పదవ తరగతి నుంచి 30%, ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి 70%:
ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షలు రద్దు చేసినప్పటికీ కరోనా నిబంధనలు పాటిస్తూనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించామని అన్నారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మూడు సబ్జెక్ట్‌ల యావరేజ్‌కి 30 శాతం వెయిటేజీ ఇవ్వడంతో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో సాధించిన మార్కులకు మరో 70 శాతం వెయిటేజీని జోడించి ఫలితాలు వెల్లడించినట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.


AP inter exams 2021: కరోనా వైరస్ తగ్గిన తర్వాత వారికి పరీక్షలు:
ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా సెకండ్ ఇయర్‌లో పాస్ చేసినట్టు మంత్రి సురేష్ చెప్పుకొచ్చారు. ఇంటర్ ఫలితాలపై ఎవరైనా విద్యార్ధులకు అసంతృప్తి ఉన్నట్టయితే.. వారి కోసం కరోనా వైరస్ తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. 


AP 10th class results 2021: 10వ తరగతి ఫలితాలుపై క్లారిటీ:
ఇవాళ ఇంటర్ ఫలితాలు వెల్లడించిన మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. మరో వారం రోజుల వ్యవధిలో 10వ తరగతి ఫలితాలు (AP SSC results 2021) కూడా ప్రకటిస్తామని స్పష్టంచేశారు.