ఈ నెల 12వ తేదిన ఇంటర్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్ష ఫలితాలను ఈ నెలలో విడుదల చేస్తామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్ష ఫలితాలను ఈ నెలలో విడుదల చేస్తామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 12వ తేదిన ఇంటర్ ద్వితీయ సంవత్సరాల ఫలితాలను, 13వ తేదిన ప్రథమ సంవత్సర ఫలితాలను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు పరీక్షలను నిర్వహించింది.
ఏపీలో 1423 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి 5,09,898 మంది విద్యార్థులు హాజరు కాగా, ద్వితీయ సంవత్సరానికి 5,16,993 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సారి కూడా ఇంటర్ ఫలితాలకు సంబంధించి గ్రేడింగ్ విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని బోర్డు తెలిపింది. గత సంవత్సరం మాదిరిగానే ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్‌లో విద్యార్థులు చూడవచ్చు