AP Inter Exams Fee: ఏపీలో ఇంటర్ పరీక్షలు ఎప్పుడు, పరీక్ష ఫీజు ఎంత, ఎప్పటిలోగా చెల్లించాలి
AP Inter Exams Fee: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రభుత్వ సన్నాహాలు ప్రారంభించింది. పరీక్ష ఫీజుల చెల్లింపుకు షెడ్యూల్ విడుదల చేసింది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు. ఆ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
AP Inter Exams Fee: ఏపీలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం జనరల్, ఒకేషనల్ పరీక్షల ఫీజు వివరాలు వెల్లడించింది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు తేదీ ఎప్పటివరకు ఉందో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంటర్ పరీక్షల షెఢ్యూల్ విడుదల చేసింది. 2024 మార్చ్‌లో జరిగే ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులు చెల్లించాల్సి ఫీజు వివరాలు, గడువు తేదీ, పెనాల్టీ వంటి కీలకమైన వివరాలు ఇందులో ఉన్నాయి. ఇచ్చిన గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించకపోతే ఆ తరువాత పెనాల్టీతో చెల్లించాల్సి వస్తుందని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఇంటర్మీడియట్ పరీక్షలు 2024 మార్చ్‌లో జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం రెగ్యులర్, ఒకేషనల్, ప్రైవేట్ విద్యార్ధులు నవంబర్ 30 వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. నవంబర్ 30 దాటితే ఏకంగా 1000 రూపాయల జరిమానాతో డిసెంబర్ 15 వరకూ గడువు ఉంటుంది.
ఇంటర్ పరీక్ష ఫీజు వివరాలు
ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం థియరీ పరీక్షలకు 550 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇంటర్ రెండవ సంవత్సరం జనరల్ ప్రాక్టికల్స్, మొదటి, రెండవ సంవత్సరం ఒకేషనల్ ప్రాక్టికల్స్ విద్యార్తులు 250 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఇక బ్రిడ్జి కోర్సులకు 150 రూపాయలు ఫీజు ఉంటుంది.
ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం కలిపి థియరీ పరీక్షలకు 1100 రూపాయలు ఫీజు ఉంది. ఒకేషనల్ రెండేళ్ల ప్రాక్టికల్స్ కు 500 రూపాయలు, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సుకు 300 రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఇంటర్ బెటర్‌మెంట్ రాసే విద్యార్ధులు రెండేళ్లకు కలిపి సైన్స్ విద్యార్దులు 1440 రూపాయలు, ఆర్ట్స్ విద్యార్ధులు 1240 రూపాయలు చెల్లించాలి.
Also read: LPG Gas Cylinder Price Hike: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు షాక్, మరోసారి పెరిగిన సిలెండర్ ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook