AP Inter Exams Tips: పదవ తరగతి పరీక్షలు ముగియనున్నాయి. త్వరలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్ధుల కెరీర్ నిర్ణయించే పరీక్షలు కావడంతో చాలా కీలకమివి. మరి మంచి మార్కులు సాధించేందుకు ప్రిపేర్ కావాలో కొన్ని టిప్స్ తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశమంతా వివిధ రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇక మిగిలింది కీలకమైన ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభమై..మే 19 వరకూ జరగనున్నాయి. విద్యార్ధుల కెరీర్‌ను మార్చేది, నిర్ణయించేది ఈ పరీక్షలే. భవిష్యత్తులో విద్యార్ధి ఎటువైపు వెళ్లేది నిర్ణయించేది ఇంటర్మీడియట్ పరీక్షలే. అందుకే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం..రెండూ పబ్లిక్ పరీక్షలే. ఇంటర్మీడియట్ పరీక్షల్లో లభించే మార్కులతో ఆ విద్యార్ధుల భవిష్యత్ నిర్ణయమవుతుంది. 


అందుకే ప్రతి విద్యార్ది దశలో ఇంటర్మిడియట్ పరీక్షలపై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. గత సంవత్సరపు పరీక్ష పేపర్లు, స్టడీ మెటీరియల్ ద్వారా విద్యార్ధులు మంచి మార్కులు సాధించేందుకు అవకాశముంది. విద్యార్ధులు ఎలా ప్రిపేర్ కావాలి, మంచి మార్కులు ఎలా సాధించాలనే విషయంపై నిపుణులు చెప్పే కొన్ని ముఖ్యమైన సూచనలు తెలుసుకుందాం..


స్కోరింగ్ సబ్జెక్టులు ఇవే


ప్రధాన సబ్జెక్టులు మేథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయోలజీలపై ప్రధానంగా దృష్టి ఎక్కువ సారించాలి. మేథ్స్ విషయంలో ఫండమెంటల్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ముందుగా మేథ్స్ విషయంలో సాంప్రదాయ పద్ధతుల్ని అభ్యసించిన తరువాతే..షార్ట్ కట్ పద్ధతుల్ని ఆశ్రయించాలి. ఇక కెమిస్ట్రీలో ఈక్వేషన్స్, రియాక్షన్స్, ఫార్ములాలు, ప్రయోగాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. బయోలజీ విషయంలో థియరీ, డయాగ్రమ్స్‌ను ఎక్కువగా నేర్చుకోవాలి. బయోలజీలో కష్టమైన పదాలపై పట్టు సాధించడం, స్పెల్లింగ్ కరెక్ట్‌గా ఉండేట్టు చూసుకోవాలి. మేథ్స్‌లో పట్టుంటే ఫిజిక్స్ సులభమవుతుంది. 


ముఖ్యమైన టిప్స్


ముందు టైమ్ టేబుల్ సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు నిర్ణీత సమయం కేటాయించాలి. చదివేది 4-5 గంటలైనా డిస్ట్రాక్షన్ ఉండకుండా చూసుకోవాలి. గత సంవత్సరపు ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్లు, శాంపిల్ పేపర్లు, ప్రతి ఛాప్టర్ దిగువన ఇచ్చే ప్రశ్నల్ని ప్రాక్టీసు చేయాలి. ఇప్పుడు సమయం తక్కువున్నందున..రివిజన్ అనేది ప్రధానం. ఇప్పటి వరకు చదివిన ప్రతి అంశాన్ని రివిజన్ చేయాలి. పాత సంవత్సరపు పరీక్ష పేపర్లలో ఇచ్చే ప్రధానమైన క్వశ్చన్స్ అధ్యయనం చేయాలి. కేవలం నాలుగు రోజుల సమయం ఉన్నందున..రివిజన్ ప్రతి సబ్జెక్ట్ రివిజన్ చాలా అవసరం. 


కేవలం ప్రిపరేషనే కాకుండా..మంచి బలవర్ధకమైన ఆహారం, రోజుకు 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. మానసికంగా ఒత్తిడి లేకుండా ఉండాలంటే ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. పరీక్ష రాసేటప్పుడు కూడా హ్యాండ్ రైటింగ్ బాగుండేట్టు చూసుకోవాలి. అదే సమయంలో సోషల్, బయోలజీ, లాంగ్వేజెస్ రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్ ప్రధానంగా ఉండేట్టు చూసుకోవాలి. పరీక్ష రాసేటప్పుడు కన్ఫ్యూజన్ కు గురి కాకుండా..చూసుకోవాలి. ముందు తెలిసిన ప్రశ్నలకు సమాధానం రాయాలి. చివర్లో మాత్రమే వదిలేసిన ప్రశ్నలపై ఫోకస్ పెట్టాలి. 


Also read : CM Jagan Ramadan Wishes: ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ పండగ శుభాకాంక్షలు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.