ఏపీ శాసనమండలి ఛైర్మన్గా ఫరూక్ ఏకగ్రీవ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్‌గా ఎమ్మెల్సీ ఎన్ఎండి ఫరూక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఆయన శాసనమండలి చైర్మన్‌గా నామినేషన్ వేశారు. అధికారులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు వేచి చూసినా, ఆయన తప్ప మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో చైర్మన్‌గా ఫరూక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. అంతకుముందు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మంత్రి నారా లోకేష్, యనమల రామకృష్ణుడుతో పాటు మరో పది మంది ఎమ్మెల్సీలు సంతకాలు చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఫరూక్ శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్నట్లు సమాచారం.