ఢిల్లీ: ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు కృష్ణదేవరాయలుతో పాటుగా వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ (Gajendra Singh Shekhawat)ను ఏపీ మంత్రి అనిల్ యాదవ్ కలిశారు. ఏపీలో నీటి అంశాలు, జల వివాదంపై కేంద్ర మంత్రితో చర్చించారు. అనంతరం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. 2021 డిసెంబర్ కల్లా పోలవరం  (Polavaram Project) పూర్తి చేయాలన్నది ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు వెంటే విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించాం. పోలవరం ప్రాజెక్టు రీయింబర్స్మెంట్ నిధులు సాధ్యమైనంత త్వరగా విడుదల చేసి సహాయం చేయాలని కోరాం. రెండు మూడు రోజుల్లోనే నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. పునరావాసం ప్యాకేజీని ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారు. నాలుగు వేల కోట్ల రూపాయల పోలవరం బకాయిలు విడుదల చేస్తామని చెప్పారని’ వివరించారు.



[[{"fid":"193570","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ను కలిసిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ను కలిసిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ను కలిసిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్","class":"media-element file-default","data-delta":"1"}}]]


వరదల సమయంలోనూ పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం జగన్ ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్‌కు తెలిపినట్లు పేర్కొన్నారు. కాగా, కృష్ణా ప్రాజెక్టులతో రాయలసీమకు కలిగే ప్రయోజనాలను సైతం వివరించాం. దీనిపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటులో త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. నీటి సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవచ్చుని, ఆందోళన అక్కర్లేదని కేంద్ర మంత్రి షేకావత్ హామీ ఇచ్చారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe