Vizag Development: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. బాబు పాలనంతా దోపిడీనేనని విమర్శించారు. హుద్‌హుద్ తుపాను వంకతో భూ రికార్డులు తారుమారు చేశారని గుర్తు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం అభివృద్ధి అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్(YSR) హయాంలోనే జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana)స్పష్టం చేశారు. ఫార్మా సిటీకు పునాది పడింది వైఎస్సార్ హయాంలోనేనని చెప్పారు. విశాఖలో పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకుని కోర్టుకు వెళ్లింది చంద్రబాబేనని ఆయన ధ్వజమెత్తారు. హుద్‌హుద్ తుపాను (Hudhud cyclone) కారణంగా చూపించి మొత్తం రికార్డులు తారుమారు చేశారన్నారు. చంద్రబాబు గత పాలనంతా దోపీడీనేనని అన్నారు. భూ రికార్డుల తారుమారుపై అప్పటి మంత్రులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న సంగతిని గుర్తు చేశారు. 


ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) పాలనలో  30 లక్షల ఇళ్ల పట్టాల్ని ఇచ్చామని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టును 9 వందల కోట్లతో రూపొందించి..4 వందల కోట్ల అప్పులు, మిగిలిన ఆస్థుల్ని జీవీఎంసీకు చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. తెలుగుదేశం హయాంలో ఎప్పుడైనా మెట్రోపై సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. మరోవైపు  అమృత స్కీమ్(Amritha scheme) విషయంలో కేంద్రమంత్రి వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. 1150 కోట్లు ఈ స్కీమ్ కింద ఇచ్చామంటున్న కేంద్రమంత్రికి..తమ ప్రభుత్వం అదే స్కీమ్ కోసం 72 శాతం వెచ్చించిన సంగతి తెలియదా అని ప్రశ్నించారు. అమృత స్కీమ్ అమలులో విశాఖపట్నం నెంబర్ వన్ అని అదే కేంద్రమంత్రి గతంలో చెప్పిన సంగతిని కూడా గుర్తు చేశారు. 


Also read: Chandrababu go Back: విశాఖపట్నంలో బాబుకు చుక్కెదురు, గో బ్యాక్ నినాదాలతో ప్లకార్డులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook