Konaseema Protest: మంగళవారం అల్లర్లు, విధ్వంసకాండతో అట్టుడికిన అమలాపురంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను భారీగా మోహరించడంతో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటర్ విద్యార్థులు, అత్యవసర పనులు ఉన్నవాళ్లు మాత్రమే రోడ్లపైకి వస్తున్నారు. 5 వందల మందికి పైగా పోలీసులు అమలాపురంలో పహారా కాస్తున్నారు. కోనసీమ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అమలాపురంలో కర్ఫ్యూ విధించాలని అనుకున్నా.. ప్రజా జీవనానికి ఇబ్బంది కల్గకుండా విధించలేదని డీఐజీ పాలరాజు తెలిపారు. అల్లర్లకు సంబంధించిన వీడియోలు, సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ నిందితులను గుర్తిస్తున్నారు పోలీసులు. ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు.. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమలాపురంలో అల్లర్లు తగ్గినా రాజకీయ మంటలు మాత్రం ఉధృతమవుతున్నాయి. మంగళవారం జరిగిన విధ్వంసంపై అధికార, విపక్ష నేతలు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. మీరంటే మీరే కారణమంటూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అమలాపురం విధ్వంస ఘటనలపై మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు. అల్లర్లకు సంబంధించి ఆయన సంచలన ఆరోపణలు చేశారు. విధ్వంసం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. గతంలో తునిలో జరిగిన అల్లర్లకు చంద్రబాబే కారణమని.. ఇప్పుడు అమలాపురంలోనూ ఆయన కుట్రలో భాగంగానే విధ్వంసం జరిగిందని ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే అల్లర్లు స్పష్టించారని, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను తగలబెట్టారని మండిపడ్డారు. హింసను పెంచడానికే ఇలాంటి చర్యలకు దిగారని మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బస్సులకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు జై జనసేన, జై పవన్ కల్యాణ్ అనడం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. చంద్రబాబు, పవన్ కలిసే ఈ తతంగం నడిపించారని అన్నారు.
 
ప్రజల అభిష్టం మేరకే కొత్త జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా  పేరు మార్చామని మంత్రి రాజా చెప్పారు. అమలాపురం కేంద్రంగా ఉన్న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని స్థానిక టీడీపీ, జనసేన నేతలు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చారని చెప్పారు. గతంలో లేఖలు ఇచ్చిన వాళ్లే ఇప్పుడు విధ్వంసం చేయించారని మంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చంద్రబాబు ఇష్టం లేదన్నారు. అందుకే చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. గతంలో వంగవీటి రంగాపై చంద్రబాబు కుట్రలు చేశారని.. తర్వాత వైఎస్సార్ ను టార్గెట్ చేశారని.. ఇప్పుడు సంక్షేమ పాలనతో ప్రజల ఆదరణ చూరగొంటున్న సీఎం జగన్ పై కుట్రలు చేస్తున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. అమలాపురంలో జరిగిన అల్లర్ల వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి దాడిశెట్టి రాజా హెచ్చరించారు.


READ ALSO: Konaseema Protest: అప్పుడు తుని.. ఇప్పుడు అమలాపురం! మంటలతో భీతిల్లిన గోదావరి జనం..


READ ALSO: PM Modi Hyderabad Tour: 930 మంది విద్యార్థులకు 2 వేల మంది పోలీసులు.. మోడీ పర్యటనకు ఎందుకంత భద్రత?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook