AP Minister Kodali Nani says False propaganda is going on drugs according to strategy: వ్యూహం ప్రకారమే డ్రగ్స్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి కొడాలి నాని (Kodali Nani) మండిపడ్డారు. అలాగే ఒక పథకం ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై (YS Jagan Mohan Reddy) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొడాలి నాని విమర్శించారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాటా తీస్తామంటూ కొడాలి నాని హెచ్చరించారు. టీడీపీ నేత పట్టాభి డబ్బులు తీసుకొని తిడుతున్నారని కొడాలి ఆరోపించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కావాలనే రెచ్చగొట్టారంటూ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ఏం కాదని, సీఎం వైఎస్‌ జగన్‌ను (YS Jagan) వాళ్లు ఇంచు కూడా కదపలేరన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : IND Vs AUS warm-up match: ఆస్ట్రేలియాపై వార్మప్​ మ్యాచ్​‌లోనూ India విజయం


కేంద్ర మంత్రి అమిత్‌షాపై (Amit Shah) తిరుపతిలో చంద్రబాబు రాళ్లతో దాడి చేయించారని.. చంద్రబాబు గురించి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వ్యక్తో అమిత్‌షాలకు బాగా తెలుసు అన్నారు. ఎవరెన్నీ చేసినా ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ( (YS Jagan Mohan Reddy) ఏమీ చేయలేరన్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి చేస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్‌లో పడుకున్నాడని.. ఇప్పుడు టీడీపీ ఆఫీస్‌లో రెండు కుర్చీలు విరిగిపోగానే ప్రజాస్వామ్యం ఖూనీ అంటున్నాడు కొడాలి నాని (Kodali Nani) విమర్శించారు. లోకేష్ విసిరిన ఛాలెంజ్‌లకు తాము స్పందించలేమన్నారు.


Also Read : Women Eating Dead Husband Ashes: చనిపోయిన భర్త చితాభస్మాన్ని తింటున్న మహిళ.. వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి