Visakhapatnam: విశాఖ పేలుడు ఘటనపై స్పందించిన మంత్రి మేకపాటి
Vizag chemical plant: విశాఖపట్నం: పరవాడ ఫార్మాసిటీలో పేలుడు ఘటనపై రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. విశాఖ జిల్లా అధికార యంత్రాంగంతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి.. రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో ( Ramky CETP solvents ) పేలుడు ఘటనపై ఆరాతీశారు.
Vizag chemical plant: విశాఖపట్నం: పరవాడ ఫార్మాసిటీలో పేలుడు ఘటనపై రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. విశాఖపట్నం అధికార యంత్రాంగంతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి.. రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో ( Ramky CETP solvents ) పేలుడు ఘటనపై ఆరాతీశారు. పేలుడు ఘటనకు సంబంధించిన వివరాలు, ప్రాథమిక సమాచారాన్ని మంత్రి జిల్లా ఉన్నతాధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. భారీ ఎత్తున మంటలు వ్యాపిస్తున్నందున ప్రమాదం తీవ్రత పెరగక ముందే ముందుగా స్థానిక ప్రజలను, ఫార్మాసిటీ పరిధిలో రాత్రివేళ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా మంత్రి మేకపాటి పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు. ( Also read: Vizag: ఫార్మా సిటీలో భారీ పేలుడు.. ఉలిక్కిపడిన విశాఖ )
అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసు అధికారులు సహాయ చర్యల్లో ( Resque operations ) చురుకుగా పాల్గొనాల్సిందిగా ఆదేశించడంతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉండి క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించాల్సిందిగా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ( Minister Mekapati Goutham Reddy ) విజ్ఞప్తి చేశారు. ( Also read: COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది )