Tirupati By Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఎన్నికల వేడి చల్లారలేదు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాయని అనుకునేలోగా మరో ఎన్నిక వేడి రాజుకుంది. తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో అందరీ దృష్టీ తిరుపతిపై పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు(Ap Municipal Elections) ముగిశాయి. అధికారపార్టీ భారీ విజయం సాధించి ఉత్సాహంతో ఉంది. సరిగ్గే ఇదే సమయంలో తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 17న తిరుపతి ఉపఎన్నిక జరగనుంది. తిరుపతి కార్పొరేషన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..తిరుపతి లోక్‌సభ ( Tirupati loksabha)లో భారీ విజయం సాధిస్తామని అంచనా వేస్తోంది. తిరుపతి ఎంపీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ రావు ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. తిరుపతి ఉపఎన్నికలో 3 లక్షల మెజార్టీ సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో భారీగా గెలిచామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన వల్లే ఈ ఫలితాలన్నీ వస్తున్నాయన్నారు. ఎన్నికలకు సంబంధించిన కేసులన్నీ క్లియర్ అయ్యాయని చెప్పారు. 


ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా తక్షణం పెట్టాలని కోరుకుంటున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి ( Peddireddy Ramachandra reddy) తెలిపారు. కేవలం 6 రోజుల్లోనే జడ్పీటీసీ ఎన్నికలు పూర్తవుతాయని..వాటిని కూడా పూర్తి చేస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. ఇక ఈ నెల 18 న జరగబోయే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్లు ఉంటారని..దీనికి అవసరమైన ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామని మంత్రి చెప్పారు. 


Also read: By Elections Schedule 2021: తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook