Perni Nani satires on Nara Lokesh beard look: అమరావతి: నారా లోకేష్‌ పై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటన విషయంలో ఏపీ సర్కారుపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన మంత్రి పేర్ని నాని.. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన లోకేష్ ఇలా ఒక ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యాన్ని (Tadepalli gangrape) కూడా రాజకీయం చేయడం సరికాదు అని హితవు పలికారు. సమాజంలో మృగాలు ఉన్నాయి. ఎంత కఠిన చట్టాలు తీసుకొచ్చి, ఎన్ని చర్యలు తీసుకున్నా వాళ్ల ఆగడాలు ఆగడం లేదు. వాళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తప్పు. కానీ వాళ్లని కచ్చితంగా పట్టుకుని. కఠిన చర్యలు తీసుకుంటాం అని స్పష్టంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటన (Tadepalli gangrape news) విషయంలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని మంత్రి పేర్ని నాని భరోసా ఇచ్చారు. అయితే బాధితులకు అండగా నిలబడి వారికి మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నాలు చేయాల్సిన సమయంలో లోకేష్ రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. 


Also read : AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు


ఎన్నికల్లో పార్టీ ఓటమితో ఓడిపోయి రాజకీయ నిరుద్యోగిగా మారిన లోకేష్ (Nara Lokesh).. ఇప్పుడు ఉద్యోగం కోసం తాపత్రయపడుతున్నారంటూ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తాడేమో అనే భయంతోనే నారా లోకేష్ (Nara Lokesh fearing for Jr Ntr's political entry) ఇలా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారంటూ సెటైర్లు వేశారు. చుట్టూ ఉన్న 10 మందితో చప్పట్లు కొట్టించుకుని అదే గొప్పని అనుకోవడం కాదు.. 5 కోట్ల మంది ఆంధ్రులతో చప్పట్లు కొట్టించుకోగలగాలి అని లోకేష్‌కి సూచించారు. అదే క్రమంలో గడ్డం పెంచిన వాడల్లా గబ్బర్ సింగ్ (Perni Nani's Gabbar Singh comments) కాలేడు అంటూ పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలకు నారా లోకేష్ ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.


Also read : Anandaiah Corona medicine: ఆనందయ్య చుక్కల మందులో హానికారక పదార్థం, రిపోర్టులో ఆశ్చర్యకర విషయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook