Tirupati Bypoll: తిరుపతి ఉపఎన్నికల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు అధికమౌతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్‌పై అధికారపార్టీ నేతలు మండిపడుతున్నారు. పాచిపోయిన లడ్డూని తుడుచుకుని తింటున్నారా అని ప్రశ్నిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూటకో పార్టీ పొత్తుతో పవన్ కళ్యాణ్ (Pawan kalyan) పరిస్థితి అద్దె మైక్‌లా మారిందని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉపఎన్నికల్లో (Tirupati Bypoll) బీజేపీ తరపున ప్రచారం సాగిస్తున్న పవన్ కళ్యాణ్‌కు నిలకడ లేదని స్పష్టం చేశారు. 2014లో బీజేపీకు, తరువాత టీడీపీకు ఓటేయాలని పవన్ కళ్యాణ్ కోరినట్టు చెప్పారు. అంతేకాకుండా దక్షిణాదిని ఉత్తరాదివాళ్లు అన్యాయం చేస్తున్నారంటూ రంకెలేసిన పవన్ కళ్యాణ్..ఇప్పుడు అదే పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్నారు. కాకినాడ సభలో పాచిపోయిన లడ్డూ అని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే లడ్డూని తుడుచుకుని తింటున్నారా అని పేర్ని నాని ప్రశ్నించారు. 


ఒక్క ముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి అద్దె మైక్‌లా మారిందన్నారు. వెంకన్న స్వామి ఎవరికి శిక్ష వేశారు, పవన్ కళ్యాణ్ కు గుండు ఎవరు కొట్టించారు, గత ప్రభుత్వ హయాంలో ఆలయాల్ని ధ్వంసం చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని పేర్ని నాని ( Minister Perni nani) దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ నిజంగానే అజ్ఞాతవాసి ఆని..నిబద్ధత లేని నాయకుడని అన్నారు. కాపులపై గత ప్రభుత్వం కేసులు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చిరంజీవి తమ్ముడిగానే పవన్‌కు గుర్తింపని స్పష్టం చేశారు. బీజేపీ ( Bjp) తో కలిసే ఉన్నప్పుడు హోదాపై ఎందుకు నిలదీయడం లేదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని..అంతర్వేది రధం దగ్దం ఘటనలో సీబీఐ విచారణకు బీజేపీ ఎందుకు ఒప్పుకోలేదని అడిగారు. రధాల్ని దగ్దం చేయడంలో బీజేపీ పాత్ర ఉందనే విషయం పవన్ కళ్యాణ్ మాటలతో అనుమానం కలుగుతోందన్నారు. 


Also read: AP ZPTC Elections: పరిషత్ ఎన్నికలపై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook