Roja Selfie with Modi: తెలుగు వీర లేవరా.. దీక్ష భూని సాగరా అంటూ జనాలను మేల్కోలిపి బ్రిటీషర్ల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించిన మన్లం విప్లవ వీరుడు అల్లూరి సీతామారాజు 125వ జయంతిని ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. భీమవరంలో నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ గవర్నర్ హరిచందన్ విశ్వభూషన్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. భీమవరంలో జరిగిన అల్లూరి జయంతి వేడుకల్లో ఏపీ మంత్రి అర్కే రోజా హల్చల్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర పర్యాటక, టూరిజం శాఖ నిర్వహించిన అల్లూరు 125వ జయంతి వేడుకల్లో ఏపీ పర్యాటక, సాంస్కృతిక మంత్రి ఆర్కే రోజా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సభా వేదికపై అంతా తానే వ్యవహరించారు. ప్రధాని మోడీ సహా ముఖ్య అతిథులను సాదరంగా ఆహ్వానించారు. వేదికపై మెగాస్టార్ చిరంజీవితో సరదాగా మాట్లాడారు. అంతేకాదు సభ ముగిసిన తర్వాత వెళ్లడానికి సిద్ధమైన ప్రధాని నరేంద్ర మోడీతో సెల్ఫీ దిగారు మంత్రి రోజా. ప్రధాని నరేంద్ర మోడీని కాసేపు ఆపేసి సెల్ఫీ తీసుకున్నారు రోజా. సీఎం జగన్, చిరంజీవి కవర్ అయ్యేలా ప్రధాని మోడీతో మరో సెల్ఫీ తీసుకున్నారు. సభా వేదికపై మంత్రి రోజా చేస్తున్న హడావుడి  చూస్తూ ఇతర నేతలు నవ్వుకున్నారు.


Read also: Chiranjeevi: ప్రధాని మోడీ సభలో చిరంజీవి.. ఆయనే టార్గెట్టా? బీజేపీతో అట్లుంటది మరీ..


Read also: Pawan Kalyan: అక్కడ మోడీ.. ఇక్కడ పవన్! ప్రధాని పర్యటనకు జనసేనాని డుమ్మా అందుకేనా?  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి



Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook