Airtel Recharge Plans Hike: సామాన్యులకు భారీ షాక్.. జియో బాటలోనే ఎయిర్ టెల్ ఏకంగా దాదాపు 23 శాతం వరకు ఎయిర్‌టెల్ రీఛార్జీ ప్లాన్ పెంచేసింది. దీంతో ఎయిర్ టెల్ కనీస అన్‌లిమిటెడ్ రీఛార్జీ ప్లాన్స్ రూ.199 తో మొదలుకానుంది.
జియో రీఛార్జీ ప్లాన్స్ పెంచిన మరుసటిరోజే భారతీ ఎయిర్ టెల్ టెలికాం దిగ్గజం కూడా అదే బాట పట్టింది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రెండిటిపై భారీగా రీఛార్జీ ప్లాన్స్ ధరలను పెంచేసింది. 2021 తర్వాత భారీ పెరుగుదల ఇప్పుడే జరిగింది. ఎయిర్ టెల్ రీఛార్జీ ఏడాది ప్లాన్ రూ. 3599 నుంచి రూ. 3999 కు పెంచేసింది. ఇతర ప్లాన్స్‌పై కూడా 11% నుంచి 20% మధ్య రీఛార్జీ ప్లాన్స్ పెంచేసింది.
ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధరలను కూడా విపరీతంగా పెంచేసింది. రూ. 999 రీఛార్జీ ప్లాన్‌ను రూ. 1,199 కు పెంచేసింది. పెరిగిన ఎయిర్‌టెల్ ప్లాన్స్ ధరలు జూలై 3 నుంచి వర్తించనున్నాయి. ఇది అన్ని ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ టెల్ వినియోగదారులకు వర్తిస్తుందని తెలిపింది.
ఇదీ చదవండి: 10వ తరగతి పాసైతే చాలు కేంద్రప్రభుత్వ ఉద్యోగం.. 8,326 పోస్టులతో భారీ నోటిఫికేషన్
కొత్త ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్స్ వివరాలు..
రూ. 179 రీఛార్జీ ప్లాన్‌ను రూ. 199కు, రూ. 265ను, రూ. 299కు, రూ. 299ను రూ. 349, రూ. 359 ప్లాన్‌ను రూ. 409కు పెంచేసింది. ఇక యాడ్ ఆన్ డేటా ఒక్కరోజుకు రూ. 19ను రూ. 22 కు పెంచేసింది ఇందులో 1 జీబీ డేటా వస్తుంది.
ఇదీ చదవండి: ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు జీవితాంతం పెన్షన్ అందుకోవచ్చు
ఈ పెరిగిన రీఛార్జీ ధరలను తెలిసిన వినియోగదారులు ట్విట్టర్ వేదికగా తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విపరీతంగా మీమ్స్ వస్తున్నాయి. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జీ ధరలపై సోషల్ మీడియా వేదికగా వినియోగదారులు విపరీతంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు.
#Airtel #Airtel
You can now fuck off 🤡🤡🤡 pic.twitter.com/AMgtGtUV7X— Vijay Vardhan (@vijay_vardhan_6) November 23, 2021
#Airtel users right now......... pic.twitter.com/FlVbl8o2eu
— नितेश सिंह 💫 (@niteshsingh____) November 22, 2021
average chamcha after #Airtel hikes their prepaid tariffs pic.twitter.com/VpPMQaPz5e
— 🕸️ (@TeaLove2021) November 22, 2021
CEO @airtelindia
Thanks airtel to providing 2G service in 4G rates what a performance
Time to choose @reliancejio pic.twitter.com/gfQNTyEL4a— Companion of Truth (@companionftruth) November 20, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter
Airtel Recharge Plans Hike: ఎయిర్‌టెల్ వినియోగదారులకు బిగ్‌షాక్.. భారీగా పెరిగిన రీఛార్జీ ప్లాన్స్.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్..