ROJA COMMENTS: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఒంగోలులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో అన్నగారి జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో టీడీపీ నేతల తీరుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా హాట్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో వికృత చేష్టలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఎన్టీఆర్ ని చంపిన వాళ్ళే ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న పనులతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని రోజా అన్నారు.
ఎన్టీఆర్ జయంతి వేడుకల్లోనూ వైసిపిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు పోటి చేసినా కుప్పంలో అడిగినా.. ఆయన గురించి ఒక్కరు కూడా మంచిగా చెప్పేవాళ్లు లేరన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అచ్చంనాయుడు అచ్చోసిన ఆంబొతులా మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు. వైసిపి గాలి పార్టీ కాదన్న రోజా.. టీడీపీ గాలికి కొట్టుకుపోయే పార్టీ అన్నారు. 175 స్థానాల్లో అభ్యర్థులను కూడా పెట్టుకోలేని దుస్థితలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అప్పులమయం చేసినందుకు చంద్రబాబుకు పట్టం కట్టాలా.. రాజధాని నిర్మించనందుకు పట్టం కట్టాలా అని రోజా ప్రశ్నించారు. జగన్ పాలనలో గత మూడేళ్లలో లక్షా 40 వేల కోట్ల రూపాయల సాయం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందిందని చెప్పారు. అంబేడ్కర్ లాంటి గొప్ప వ్యక్తి పేరు జిల్లాకు పెడితే రాజకీయం చేశారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు ఉంచాలో, వద్దో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. అమలాపురంలో విధ్వంసం సృష్టించిన కేసులో అరెస్టైన 70 మంది టీడీపీ, జనసేన కార్యకర్తలేనని మంత్రి తెలిపారు.


తన కో ఆర్టిస్ట్ బాలకృష్ణను చంద్రబాబు దారుణంగా మోసం చేశారన్నారు మంత్రి రోజా ఆరోపించారు. మహానేత NTR చనిపోయిన తరువాత సీఎం అయ్యే అవకాశం బాలయ్యకు ఉన్నా.. అతన్ని అమాయకుడిని చేసి చంద్రబాబు దక్కించుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్నది డూప్లికేట్ తెలుగుదేశం పార్టీ అన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మానేయాలని బాలకృష్ణకు సూచించారు రోజా. దిశ చట్టాన్ని కేంద్రం ఇంక అంగీకరించకపోయినా ఏపి పోలీసులు దాన్ని అనుసరిస్తూ మహిళలకి భద్రత కల్పిస్తున్నారని చెప్పారు.  మహానాడులో మహిళలతో జగన్ ని తిట్టించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారని.. ఆయన మీటింగ్ లకి వచ్చిన జనం కూడా ఆయన ఓటు వేయారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా తాము భావించడం లేదన్నారు రోజా. పవన్ కళ్యాణ్ టైం పాస్ కోసం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 


READ ALSO: NTR JYANTHI: ఆ పేరే తెలుగు ప్రజలకు ఓ వైబ్రేషన్.. యుగ పురుషుడికి శతకోటి నివాళులు


READ ALSO: KCR DELHI POLITICS: దసరా తర్వాత ఢిల్లీలోనే కేసీఆర్ మకాం! కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook